TG News : యాదగిరిగుట్ట, పెద్ద కందుకూరులో రియాక్టర్ పేలి ఒకరు మృతి

గాయపడిన వారిని భువనగిరి ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు...

TG News : జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులో భారీ పేలుడు సంభవించింది. ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్‌లో కంపెనీలో రియాక్టర్ పేలింది. భారీ శబ్దంతో రియాక్టర్ పేలడంతో భయంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు.రియాక్టర్(Reactor) పేలిన వెంటనే అలెర్ట్ అయిన కంపెనీ యాజమాన్యం ఎమర్జెన్సీ సైరన్‌ను మోగించింది. ప్రమాదవశాత్తు పేలుడు పదార్ధాలు బ్లాస్ట్ అవడంతో భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందగా… ఏడు మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే క్షతగాత్రులను 108లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకుచ్చారు. ఈరోజు ఉదయం ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ డిటోనేటర్ ప్లాంట్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మొత్తం ఎనిమిది మంది కార్మకులకు తీవ్ర గాయాలయ్యాయి.

TG News Update

గాయపడిన వారిని భువనగిరి ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. అయితే చికిత్స పొందుతూ కార్మికుడు కనకయ్య మృతి చెందాడు. మరో కార్మికుడు మొగిలిపాక ప్రకాష్ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే సికింద్రాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గతంలోనూ ఈ కంపెనీలో జరిగిన పేలుడు ధాటికి ఓ కార్మికుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా పెద్దఎత్తున పేలుడు సంభవించింది. దీంతో కార్మికులు ప్రాణభయంతో కంపెనీ నుంచి బయటకు పరుగులు తీశారు.

Also Read : HYDRA : మరో సంచలన నిర్ణయంతో ముందుకు వస్తున్న ‘హైడ్రా’

Leave A Reply

Your Email Id will not be published!