TG News-SC : నేడు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ

ఉప ఎన్నికలొస్తే.‌. గెలుపు తమదేనని అంటున్నారు...

TG News : ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విచారణ మంగళవారం సుప్రీం కోర్టు(Supreme Court)లో జరగనుంది. పది మంది ఎమ్మెల్యేలు విచారణ ఎదుర్కొంటున్నారు. ఈరోజు విచారణ జరగనున్న నేపథ్యంలో ఇరు పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది.గత విచారణ సమయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారో చెప్పాలన్న సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్న ఆశాభావంలో బీఆర్ఎస్(BRS) ఉంది. గత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు తెలంగాణకు కూడా వర్తిస్తాయని బీఆర్ఎస్ అంటోంది. దీంతో తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) అన్నారు.

TG News-SC..

ఉప ఎన్నికలకు క్యాడర్ సిద్దంగా ఉండాలని కేసీఆర్, కేటీఆర్ బీఆర్ఎస్ నేతలకు సూచించారు. ఉప ఎన్నికలొస్తే.‌. గెలుపు తమదేనని అంటున్నారు. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలు.. వివరణ ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ నోటీసులిచ్చారు. దీంతో తమకు 40 రోజుల సమయం కావాలని పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీక‌కు సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ తరఫు లాయర్లకు తోడు సొంతంగా లాయర్లను పెట్టుకున్నారు. బీఅర్ఎస్ హయాంలో ఫిరాయింపులపై అప్పటి స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని పార్టీ మారిన ఎమ్మెల్యేలు అంటున్నారు. ఈ విషయం కోర్టులోనే తేల్చుకుంటామంటామని ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.

కాగా బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌కు వెళ్లిన పది మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీ వరుస పిటిషన్లు దాఖలు చేసింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డితో పాటు వివేకానంద గౌడ దాఖలు చేసిన రెండు పిటిషన్లతో పాటు ఇటీవల తాజాగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. గతంలో పాడి కౌశిక్ రెడ్డి, వివేకా కలిసి పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలపై పిటిషన్‌ వేయగా.. మరో ఏడుగురి పేర్లను జత చేసి కేటీఆర్‌ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఆ రెండు పిటిషన్లను జత చేసి ఈనెల 10న సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది.

విచారణ సమయంలో రీజినబుల్‌ టైం అంటే ఏంటి.. పది నెలలు రీజనబుల్ టైం కాదని ధర్మాసనం ప్రశ్నించింది. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి కూడా కేసు విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. బీఆర్‌ఎస్ పార్టీ తరపున ఆర్యం నామసుందరం వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి దాదాపు 10 నెలలు అవుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని… వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోర్టు ముందు బీఆర్‌ఎస్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు అనంతరం కేసు విచారణను ధర్మాసనం18కి వాయిదా వేసింది. ఈ క్రమంలో ఈరోజు జరగబోయే వాదనలపై ఉత్కంఠ నెలకొంది.

Also Read : TTD Updates : ఈరోజు 10 గంటలకు శ్రీవారి మే నెల దర్శన టికెట్లు

Leave A Reply

Your Email Id will not be published!