TGPSC Group 1: టీజీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల !

టీజీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల !

TGPSC Group 1: టీజీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ(TGPSC) అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. మెయిన్స్‌కు క్వాలిఫై అయిన అభ్యర్థుల హాల్‌ టికెట్ల నంబర్లను టీజీపీఎస్సీ వెల్లడించింది. అభ్యర్థులు తమ లాగిన్‌లోకి వెళ్లి చెక్‌ చేసుకోవచ్చు. తుది కీతో పాటు రిజల్ట్స్‌ను టీజీపీఎస్సీ ఒకేసారి విడుదల చేసింది. గ్రూప్‌-1 మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.

TGPSC Group 1 – ఇక ఏటా రెండుసార్లు టెట్‌ నిర్వహణ !

ఇక నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ప్రతి సంవత్సరం రెండుసార్లు నిర్వహించనున్నారు. ఈ మేరకు 2015 డిసెంబరు 23న ఇచ్చిన జీవో 36లో సవరణ చేస్తూ శనివారం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం జీవో 18 జారీ చేశారు. ఏటా జూన్, డిసెంబరులో పరీక్షను జరుపుతామని అందులో పేర్కొన్నారు.

ఏటా ఒకసారి టెట్‌ నిర్వహిస్తామని 2015లో జీవో 36 జారీ చేసినా ఇప్పటి వరకు ఐదుసార్లు మాత్రమే పరీక్ష జరిపారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2016, 2017లో నిర్వహించారు. అనంతరం 2018 నుంచి 2021 వరకు చేపట్టలేదు. మళ్లీ 2022, 2023, 2024లో వరుసగా నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2011, 2012(రెండుసార్లు), 2014లో టెట్‌ జరిగింది.

Also Read : Dalai Lama: 89వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా దలైలామా సందేశం !

Leave A Reply

Your Email Id will not be published!