Thalapathy Vijay : ఇలయ తలపతిగా అశేష అభిమానులను సంపాదించుకున్న ఏకైక హీరోగా పేరొందారు విజయ్. ఆయన డిఫరెంట్ మేనరిజంతో ఆకట్టుకున్నారు. సౌత్ ఇండియాలో మోస్ట్ పాపులర్ నటుడిగా ఇప్పటికే తన సత్తా చాటాడు.
అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే యాక్టర్ గా పేరుంది మనోడికి. విచిత్రం ఏమిటంటే తండ్రితో తలపతి విజయ్(Thalapathy Vijay )కు భేదాలు ఉన్నాయి. తన పేరుతో పార్టీ స్థాపించడంపై ఆమధ్య కోపం వ్యక్తం చేశారు.
ఈ తరుణంలో గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తలపతి విజయ్ డీఎంకే సర్కార్ కు లోపాయికారిగా మద్దతు ఇచ్చారు. తమిళనాడు రాష్ట్రంలో అత్యధిక ఓటు బ్యాంకును ప్రభావితం చేయగలరని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తాజాగా స్థానిక, పురపాలిక ఎన్నికల్లో విజయ్ (Thalapathy Vijay )స్థాపించిన పార్టీకి చెందిన అభ్యర్థులు గెలుపొందారు. వారిని ప్రత్యేకంగా అభినందించారు నటుడు తలపతి. నెల్సన్ దర్శకత్వంలో తలపతి విజయ్, పూజా హెగ్డే కలిసి నటించిన బీస్ట్ ఈనెల 13న విడుదల కానుంది.
ఈ సందర్భంగా జరిగిన మీటింగ్ లో విజయ్ మాట్లాడారు. దర్శకుడు నెల్సన్ అడిగిన ప్రశ్నలకు విజయ్ సమాధానం ఇచ్చారు. పాలిటిక్స్ లో ఎప్పుడు రావాలనేది కాలమే సమాధానం చెబుతుందని చెప్పారు.
దేవుడి మీద నమ్మకం ఉందన్నాడు. అన్ని ఆలయాలు, దర్గాలకు వెలుతూనే ఉంటానని అన్నారు. దేవుడు కనిపించడు కానీ తండ్రి కనిపిస్తాడని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తన కొడుకుకు ఆఫర్స్ వస్తున్నాయని నటిస్తాడా లేదా అన్నది అతడికే వదిలి వేశానని చెప్పాడు. అసెంబ్లీ ఎన్నికల సమయంల సైకిల్ తొక్కుకుంటూ వెళ్లడం అనుకోకుండా జరిగిందన్నాడు తలపతి విజయ్.
Also Read : రణబీర్ ఆలియా పెళ్లి వాయిదా ?