Thatikonda Rajaiah : ఎంపీ లేదా ఎమ్మెల్సీ ఇస్తామన్నారు
కార్పొరేషన్ పదవి తీసుకోమన్నారు
Thatikonda Rajaiah : స్టేషన్ ఘనపూర్ – బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రోజుల కిందట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను కలిశానని చెప్పారు.
Thatikonda Rajaiah Comment
ఈ సందర్బంగా అక్కడ మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కూడా ఉన్నారని, కానీ ఆ ఫోటోలను వైరల్ చేశారని , దానిని చిలువలు పలువలు చేసి ప్రసారం చేశారంటూ , ప్రత్యేక వార్తలతో హోరెత్తించారంటూ వాపోయారు తాటికొండ రాజయ్య.
కేటీఆర్ తనకు స్పష్టమైన హామీ ఇచ్చారని చెప్పారు. ఎంపీ లేదా ఎమ్మెల్సీ లలో ఏదో ఒక పదవి ఇస్తామని చెప్పారని అన్నారు. అప్పటి వరకు స్టేట్ స్థాయిలో కార్పొరేషన్ పదవిని తీసుకోమని కూడా సూచించారని స్పష్టం చేశారు.
ప్రజలలో తప్పుడు భావన వెళ్లే ప్రమాదం ఉందని తాను మీ ముందుకు వచ్చానని చెప్పారు తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah). తన అనుచరులు తనను అడుగుతున్నారని అందుకే జవాబు ఇవ్వాల్సి వస్తోందన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు. తాను ఏనాడూ పార్టీ గీత దాటే ప్రయత్నం చేయలేదన్నారు తాటికొండ రాజయ్య.
Also Read : AP CID Chandra Babu : చంద్రబాబు సహకరించడం లేదు