CJI Pawan Khera : అదుపులో ఉంటే అంత మంచిది – సీజేఐ

కాంగ్రెస్ నేత ప‌వ‌న్ ఖేరా కేసులో కామెంట్స్

CJI Pawan Khera : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్ (CJI Pawan Khera) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. గురువారం కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. మ‌ధ్యంత‌ర బెయిల్స్ మంజూరు చేయ‌డం అనేది ప్ర‌తిరోజు అవ‌స‌రంగా మారింద‌ని పేర్కొన్నారు. అంతే కాకుండా బాధ్య‌త క‌లిగిన వ్య‌క్తులు, సంస్థ‌లు, అధిపతులు, పార్టీల‌కు చెందిన నాయ‌కులు త‌మ నోళ్ల‌ను ఎంత అదుపులో ఉంచుకుంటే అంత మంచిద‌ని సూచించారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన మీడియా సెల్ ఇంఛార్జ్ , సీనియ‌ర్ నాయ‌కుడు ప‌వ‌న్ ఖేరాను అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేయాలంటూ పార్టీ అత్య‌వ‌స‌ర పిటిష‌న్ దాఖ‌లు చేసింది. దీనిపై విచార‌ణ చేప‌ట్టారు సీజేఐ చంద్ర‌చూడ్. ర‌క్ష‌ణ క‌ల్పించ‌డం మా బాధ్య‌త‌. ప్ర‌శ్నించ‌డం, నిల‌దీయ‌డం, హ‌క్కుల గురించి ప్ర‌స్తావించ‌డం ప్ర‌తి పౌరుడికి ఉంటుంది.

ఇదే సమ‌యంలో భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌ను దుర్వినియోగం చేస్తామంటే ఎలా . ప్ర‌స్తుతానికి ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్నా మున్ముందు దేని గురించైనా లేదా ఎవ‌రి గురించైనా మాట్లాడేముందు ఒక‌టికి రెండు సార్లు లేదా వంద సార్లు ఆలోచించి మాట్లాడాల‌ని స్ప‌ష్టం చేశారు భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి.

ఒక‌వేళ మాట్లాడినా మ‌నం స‌మాజంలో ఉన్నామ‌న్న సంగ‌తిని గ్ర‌హించాలి. అందునా ఒక జాతీయ పార్టీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వ్య‌క్తిగా మీరు ఇలా మాట్లాడే ముందు ఆలోచించి ఉంటే బావుండేద‌ని సూచించారు ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్(CJI). ప్ర‌స్తుతం సీజేఐ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : మాట్లాడితే అరెస్ట్ చేస్తారా !

Leave A Reply

Your Email Id will not be published!