Rahul Dravid : ఆ ఇద్దరి కెప్టెన్సీ అద్భుతం – ద్రవిడ్
సంజూ శాంసన్ , హార్దిక్ పాండ్యాపై ప్రశంస
Rahul Dravid : భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రధానంగా ఐపీఎల్ గురించి ప్రస్తావించాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, రాజస్తాన్ రాయల్స్ స్కిప్పర్ సంజూ శాంసన్ ల నాయకత్వ ప్రతిభను ఆకాశానికి ఎత్తేశాడు.
ఆ ఇద్దరూ తమ తమ జట్లకు చోదక శక్తులుగా మారారని ప్రశంసించాడు. ఆ ఇద్దరూ నాయకత్వ లక్షణాలను అసాధారణమైన రీతిలో ప్రదర్శించారంటూ పేర్కొన్నాడు హెడ్ కోచ్. సారథలుగా రాణించడం అంటే ఓ మెట్టు ఎక్కినట్టేనని అన్నాడు.
ఈ మెగా టోర్నీలో మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, పాఫ్ డుప్లెసిస్ , శ్రేయస్ అయ్యర్ , కేన్ విలియమ్సన్ , రిషబ్ పంత్ , కేఎల్ రాహుల్ సారథ్యంలోని జట్లు పాల్గొన్నాయి.
కానీ ఈ దిగ్గజాలకు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చారు పాండ్యా, శాంసన్ . ఫైనల్ కు చేర్చడంలో కేరళ స్టార్ హిట్టర్ శాంసన్ సక్సెస్ అయ్యాడు. ఇదిలా ఉండగా హార్దిక్ పాండ్యాను భారత సెలెక్టర్టు ఎంపిక చేశారు.
కానీ సంజూ శాంసన్ ను పక్కన పెట్టారు. దీనిపై అభిమానులు, క్రికెట్ నిపుణులు, మాజీ ఆటగాళ్లు సైతం తప్పు పడుతున్నారు. తాజాగా రాహుల్ ద్రవిడ్ చేసిన కామెంట్స్ మరింత ఆసక్తిని రేపాయి.
ఐపీఎల్ ప్రారంభం అయ్యాక సంజూ శాంసన్ 14 ఏళ్ల తర్వాత రాజస్తాన్ రాయల్స్ ను ఫైనల్ కు తీసుకు వెళ్లాడు. వారిద్దరూ గొప్ప ఆటగాళ్లు. భారత క్రికెట్ కు ఇది ఎంతో మేలు చేస్తుందన్నాడు ద్రవిడ్(Rahul Dravid).
కానీ శాంసన్ ను ఎందుకు తీసుకోలేదన్న దానికి సమాధానం చెప్పలేక పోయాడు.
Also Read : రమీజ్ రాజాపై సల్మాన్ భట్ ఫైర్