Anushka Shetty : టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ నిజం

బాంబు పేల్చిన లవ్లీ స్వీటీ అనుష్క

Anushka Shetty : ప్ర‌ముఖ హీరోయిన్ అనుష్క శెట్టి బాంబు పేల్చారు. ఇప్ప‌టికే భార‌తీ సినిమా రంగంలో క్యాస్టింగ్ కౌచ్ పై చ‌ర్చ గ‌త కొంత కాలం నుంచి న‌డుస్తోంది. ఆ మ‌ధ్య న ప్ర‌ముఖ సింగ‌ర్ చిన్మ‌యి శ్రీ‌పాద దిగ్గ‌జ ర‌చ‌యిత వైర‌ముత్తుపై సీరియ‌స్ కామెంట్స్ చేసింది.

ఆయ‌న త‌న ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ బోయాడంటూ ఆరోపించింది. ఆ త‌ర్వాత చిన్మ‌యికి అండ‌గా చాలా మంది నోరు విప్ప‌డం చేస్తూ వ‌స్తున్నారు. ఈ సింగ‌ర్ కు పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా మ‌ద్ద‌తు ల‌భించింది.

ఆ త‌ర్వాత ఆమెకు అవ‌కాశాలు రాకుండా పోయాయ‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. సినీ ఇండ‌స్ట్రీలో ఇవి మామూలేన‌ని ఎక్క‌డ చాన్స్ రావేమోనంటూ బ‌య‌ట ప‌డ‌రంటూ కొంద‌రు బ‌హిరంగంగానే పేర్కొన‌డం విశేషం.

ఈ త‌రుణంలో అనుష్క శెట్టి(Anushka Shetty) ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ క్యాస్టింగ్ కౌచ్ పై సీరియ‌స్ కామెంట్స్ చేసింది. తెలుగులో సూప‌ర్, విక్ర‌మార్కుడు, త‌దిత‌ర సినిమాల్లో న‌టించింది. టాలీవుడ్ పై కుండ బద్ద‌లు కొట్టింది.

ఇక్క‌డ కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ ఆరోపించించి అనుష్క శెట్టి. సినిమాల్లో అవ‌కాశాలు ఇస్తామంటూ మ‌భ్య పెడ‌తార‌ని, హీరోయిన్ల‌ను లోబ‌ర్చుకునే సంస్కృతి ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

టాలీవుడ్ లోనే కాదు ప్ర‌తి ఇండ‌స్ట్రీలోనూ ఉందంటూ చెప్పింది. ఎంద‌రో మ‌హిళ‌లు లైంగిక వేధింపుల‌కు లోన‌వుతున్నారంటూ వాపోయింది. తాను నిక్క‌చ్చిగా ఉండ‌టంతో త‌న వైపు ఎవ‌రూ రాలేద‌ని పేర్కొంది.

దీంతో సినీ ఇండ‌స్ట్రీలో ఇప్పుడు అనుష్క చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి.

Also Read : విజ‌య్ ‘అర‌బిక్ కుతు’ సెన్సేష‌న్

Leave A Reply

Your Email Id will not be published!