CEO UBER : క్యాబ్ డ్రైవ‌ర్ గా మారిన సిఇఓ

నెట్టింట్లో మ‌నోడి ఫోటోలు వైర‌ల్

CEO UBER  : ఒక్కొక్క‌రిది ఒక్కో స్ట్రాట‌జీ. త‌మ కంపెనీల‌ను ఎలా న‌డిపించాలో తెలుసు కోవాలంటే ముందు కింది స్థాయిలో ఎవ‌రు ఎలాంటి ప‌ని చేస్తున్నార‌నేది అనుభ‌వంలోకి రావాలి. అలా అయితేనే సంస్థ‌ల‌ను న‌డ‌ప‌గ‌లం.

కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసి కోట్లాది జ‌నాల‌తో క‌నెక్ట్ అయ్యే బిగ్ కంపెనీస్ వ్యూహాలు వేరుగా ఉంటాయి. వారి ఆలోచ‌న‌లు డిఫ‌రెంట్ గా అమ‌లు చేసే స్థాయిలో ఉంటాయి.

అందుకే ఒక్కో కంపెనీ ఒక్కో రీతిన త‌మ సంస్థ ఉద్యోగుల ప‌ట్ల‌, త‌మ యూజ‌ర్లు లేదా వినియోగ‌దారుల ప‌ట్ల తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటుంది. స‌ద‌రు కంపెనీల‌కు సంబంధించి ఇత‌ర సంస్థ‌ల‌తో, క‌న్స‌ల్టెన్సీ కంపెనీల‌తో టై అప్ అవుతూ ఉంటాయి.

కానీ ఈ మ‌ధ్య‌న ట్రెండ్ మారింది. సంస్థ‌కు బిగ్ బాస్ లు ఎవ‌రైతే ఉన్నారో వారే రంగంలోకి దిగుతున్నారు. మారు వేషంలో, అత్యంత సాధార‌ణంగా త‌మ వారితో కాకుండా వినియోగ‌దారుల‌తో, క‌స్ట‌మ‌ర్ల‌తో క‌లిసి ప్ర‌యాణం చేస్తున్నారు.

వారితో వారికి తెలియ‌కుండా ములాఖ‌త్ అవుతూ మెస్మ‌రైజ్ చేస్తున్నారు. అలాంటి అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది. ఇప్పుడు అది వైర‌ల్ గా హాట్ టాపిక్ గా గారింది.

ఆ స‌న్నివేశానికి ప్ర‌ధాన కార‌ణంగా ఉన్న‌ది మాత్రం ప్ర‌ముఖ క్యాబ్ సేవ‌లు అందిస్తున్ ఊబెర్ కంపెనీ సిఇఓ ప‌ర‌భ్ జిత్ సింగ్(CEO UBER ). మ‌నోడు తాను సిఇఓన‌న్న విష‌యం చెప్ప‌కుండానే క్యాబ్ డ్రైవ‌ర్ అవ‌తారం ఎత్తాడు.

క‌స్ట‌మ‌ర్ ను ఎక్కించుకుని వారు కోరుకున్న చోటు వ‌ద్ద‌కు దింపాడు. తీరా ఆమె దిగాక మ‌నోడు త‌న‌ను తాను ఊబ‌ర్ సిఇఓగా ప‌రిచ‌యం చేసుకున్నాడు.

దీంతో విస్తు పోయిన స‌ద‌రు మ‌హిళ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. సిఇఓ సింగ్ తో సెల్ఫీ తీసుకుని లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేసింది.

Also Read : ఆ ఫోన్ల‌లో డిజిట‌ల్ లావాదేవీలు

Leave A Reply

Your Email Id will not be published!