Arvind Kejriwal : జైలు తాళాలు తెంచే రోజు వస్తుంది – కేజ్రీవాల్
మనీస్ సిసోడియాకు సమన్లపై కామెంట్స్
Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒక రోజు జైలు ఊచలు తెంచే రోజు తప్పకుండా వస్తుందన్నారు. ఆయన తన పార్టీకి చెందిన కేబినెట్ మంత్రి సత్యేందర్ జైన్ ను జైలులో పెట్టారు. తాజాగా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సమన్లు జారీ చేసింది.
ఏ మాత్రం సమాధానం చెప్పక పోయినా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ. ఇప్పటికే ఢిల్లీ మద్యం స్కాం దేశంలో కలకల రేపింది. దీనిపై సమన్లు అందుకున్న డిప్యూటీ సీఎం సోమవారం సీబీఐ ఆఫీసుకు విచారణ నిమిత్తం బయలుదేరి వెళ్లారు.
అంతకు ముందు తన తల్లి పాదాలకు నమస్కరించారు సిసోడియా. తాను ఏ నేరానికి పాల్పడలేదన్నారు. కేంద్రం కావాలనే తనపై కక్ష కట్టిందని అందుకే నకిలీ కేసులు నమోదు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తందంటూ ఆరోపించారు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. తాను భగత్ సింగ్ వారసుడినని అరెస్ట్ లకు భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) జోక్యం చేసుకుని నేడు సిసోడియాను తాను భగత్ సింగ్ అని పిలుస్తానని చెప్పారు. తాము ఎవరికీ భయపడే ప్రసక్తి లేదన్నారు. గుజరాత్ లో బీజేపీకి బలం తగ్గుతోందని, ఆప్ కు పెరుగుతోందని అందుకే అక్కడ ఎన్నికల తేదీలు ప్రకటించ లేదన్నారు.
ఎప్పటికైనా మనీష్ సిసోడియా నిర్దోషిగా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఢిల్లీలో ఆప్ వర్సెస్ బీజేపీ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు జల్లెడ పడుతున్నాయి.
Also Read : రౌత్ కు పట్టిన గతే సిసోడియాకు కూడా