The Emergecny Comment : ఎమర్జెన్సీ కాలం మానని గాయం
1975 నుంచి 1977 దాకా సంచలనం
The Emergecny Comment : సమున్నత భారత దేశంలో చీకటి రోజులు ఏవైనా ఉన్నాయంటే అది జూన్ 25, 1975. ఇది ఎప్పటికీ మానని గాయంగా నిలిచి పోతుంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లే తరుణంలో ఏకపక్షంగా తీసుకున్న అసాధారణ నిర్ణయం యావత్ లోకాన్ని విస్తు పోయేలా చేసింది. దేశానికి బైబిల్ గా పేర్కొనే రాజ్యాంగంలో పొందు పర్చిన అంశాల లొసుగులను ప్రాతిపదికగా చేసుకున్న తీసుకున్న నిర్ణయం ఒక రకంగా సభ్య సమాజానికి మేలు కొల్పేలా చేసింది. రాచరికం చెల్లదని, నియంతలకు చరిత్రలో స్థానం ఉండదని తేలి పోయింది. డెమోక్రసీలో ప్రజలే ప్రభువులు. కానీ పవర్ ను అడ్డం పెట్టుకుని, చట్టాలను , ఖాకీలను ఆసరాగా చేసుకుని సాగించే అరాజకీయ క్రీనీడలో కొన్ని అప్పుడప్పుడు ఇలాంటి ప్రమాదకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆనాడు దేశ ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరా గాంధీ ఉన్నట్టుండి ఒకే ఒక్క సంతకంతో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించింది. దీనికి రాష్ట్రపతిగా ఉన్న ఫక్రూద్దీన్ ఆలీ అహ్మద్ తల ఊపారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు ప్రతిపక్షం అన్నది బలంగా లేక పోతే అది నిజమైన ప్రజాస్వామ్యం అనిపించు కోదని హెచ్చరించారు.
21 నెలల పాటు కొనసాగింది అత్యవసర పరిస్థితి దేశంలో. రాజ్యాంగంలోని 352 (1) అధికరణంలో పొందు పర్చబడిన అంతర్గత కల్లోల స్థితిని సాకుగా చూపి ఇందిరా గాంధీ(Indira Gandhi) ముందడుగు వేసింది. ఒక రకంగా ఆమె ఉన్నంత వరకు ఐరన్ లేడీగా ప్రసిద్ది పొందినా తన వరకు వచ్చేసరికి ఏకపక్షంగా పాలించిందనే చెప్పక తప్పదు. ఎమర్జెన్సీ విధించడంతో అసాధారణమైన అధికారాలు (పవర్స్ ) ప్రధానికి అంది వచ్చాయి. దీంతో స్వేచ్ఛకు సంకెళ్లు పడ్డాయి. ఎన్నికలంటూ ఉండవు. పౌరులకు హక్కులు వర్తించవు. ఈ ఒక్క ఆర్డర్ తో మొత్తం దేశంలో తనకు ఎదురే లేకుండా చేసుకుంటూ పోయారు ఇందిరా గాంధీ. ప్రత్యర్థులంతా జైలు పాలయ్యారు. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మగా భావించే పత్రికలు, మీడియాపై నిషేధం విధించింది. దీనిని సాకుగా చేసుకుని ఇందిరా గాంధీ తనయుడు సాగించిన దుర్మార్గాల గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఇక సర్కార్ పై పట్టు సాధించేందుకు క్యాబినెట్ లోని పవర్స్ ను కూడా ఇందిర తీసేసుకుంది. తల వంచి సలాం చేసే వాళ్లకు ప్రయారిటీ ఇచ్చింది. అనంతరం ఎన్నో జనరంజకమైన పథకాలను ప్రవేశ పెట్టింది. తనను దూషించిన నోళ్లే పొడిగేలా చేసుకున్నారు ఇందిరా గాంధీ. ఆమెను విజయేందిర అనే స్థాయికి చేరుకున్నారు. ఇక మిగిలింది న్యాయ వ్యవస్థ. దానిని కూడా కంట్రోల్ లోకి తీసుకునే ప్రయత్నం చేసింది. ఆమెను ఆనాటి జన నేత జేపీ తప్పు పట్టారు. ఇదిలా ఉండగా 1973 నుండి 75 దాకా ఇందిర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. 1977లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడిన జనతా కూటమి చేతిలో ఓటమి పాలైంది. కోర్టు ఇందిరపై సంచలన తీర్పు వెలువరించింది. ఏది ఏమైనా ఎమర్జెన్సీ అనేది చీకటి రోజులను తలపింప చేసింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. కానీ చివరకు న్యాయమే గెలిచింది. ప్రజలే విజేతలయ్యారు.
Also Read : Nara Lokesh : నా వల్లే శ్రీసిటీలో ఫ్యాక్స్ కాన్ ఏర్పాటు
