Pradeep Mehra :నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరి పోతే నిబిడాశ్చర్యంతో మీరే మీరే అన్న మహా కవి శ్రీశ్రీ రాసింది నిజమేనని అనిపిస్తోంది. టెక్నాలజీ మారింది. జీవితం మరింత ఇరుకుగా తయారైంది.
బంధాలన్నీ పలుచనై పోయాయి. మనీ లేక పోతే మాటలే లేని పరిస్థితికి సమాజం వచ్చేసింది. కానీ లక్ష్యం సమున్నతమైతే కష్టాలు,
కన్నీళ్లు , ఇబ్బందులు ఓ లెక్క కాదు. శ్రమను నమ్ముకున్న వాళ్లకు, కష్టాన్ని ప్రేమించే వాళ్లకు లక్ష్యం చిన్నదే.
సోషల్ మీడియా పుణ్యమా అని ఎందరో వెలుగులోకి వస్తున్నారు. నిమిషాల్లోపే పాపులర్ అయి పోతున్నారు. అలాంటి ఓ యువకుడి కథే ఇది.
ఎక్కడికీ ఈ పరుగు అని పాడినా కానీ అదంతా తాను ఏర్పాటు చేసుకున్న గోల్ సాధించేందుకని చెప్పిన తీరు ప్రతి ఒక్కరినీ కదిలించింది.
యావత్ దేశం అతడి సాహసాన్ని, లైఫ్ అతడికి ఉన్న కమిట్ మెంట్ ను చూసి విస్తు పోయింది.
ఇంతకీ ఈ అసాధారణ యువకుడు ఎవరో కాదు రాజధాని ఢిల్లీ వీధుల్లో అర్ధరాత్రి 10 కిలోమీటర్లు
పరుగులు పెడుతున్న ఉత్తరాఖండ్ కు చెందిన ప్రదీప్ మెహ్రా(Pradeep Mehra).
దేశం కోసం సేవ చేసే ఆర్మీలో పని చేయాలన్నది అతడి ఆశయం. అతడి కల కూడా. రోజంతా పని చేయడం. రన్నింగ్ చేస్తూ ఇంటికి వెళ్లడం.
ఎందుకంటే సైన్యంలో చేరాలంటే పరుగు తీయాల్సందే. ఇక ఈ కాలంలో అన్నీ ఉన్నా చదువుకునే ఓపిక లేని వాళ్లు ఎందరో.
నెట్టింట్లో విలువైన కాలాన్ని గుర్తించని వారెందరో. పొద్దస్తమానం సెల్ ఫోన్లలో టైం పాస్ చేసే వాళ్ల కంటే ప్రదీప్ భిన్నం.
పేదరికం వెంటాడినా, కుటుంబ పరిస్థితులు సహకరించక పోయినా, తల్లి అనారోగ్యం కుంగ తీసినా తను మాత్రం పరుగు ఆపలేదు.
రోజూ 10 కిలోమీటర్లు పరుగులు తీస్తున్నాడు. ఈ పరుగు ఉదయం పూట కాదు. అంతా నిద్ర పోయిన సమయంలో ఒక్కటు అర్ధరాత్రి తన ఇంటికి పరుగులు తీసుకుంటూ వెళుతున్నాడు. ఉదయం లేచాక ఇంటిపని,
8 గంటలకు పనికి వెళ్లడం, రాత్రి 12 గంటల దాకా పని చేసి రన్నింగ్ చేయడం పరిపాటిగా మారింది. ఫిల్మ్ మేకర్ వినోద్ అగ్నిహోత్రి ఆ కుర్రాడిని చూసి కారులో దిగబెడతానని అన్నా సున్నితంగా తిరస్కరించాడు.
తన ప్రాక్టీస్ దెబ్బతింటుందని చెప్పాడు. ఇదిలా ఉండగా ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్ర తో పాటు మంత్రి కేటీఆర్ ,
మాజీ క్రికెట్ కెప్టెన్ మైఖేల్ వాన్, హర్భజన్ సింగ్, మహమ్మద్ అజహరుద్దీన్, దేశంలోని ప్రముఖులు ప్రదీప్ మెహ్రా (Pradeep Mehra)సాహసాన్ని అభినందిస్తున్నారు. ప్రతి పేరెంట్స్ ఇతడిని చూడాల్సిన అవసరం ఉందంటున్నారు.
Also Read : సమన్వయ లోపం కాంగ్రెస్ కు శాపం