Congress G-23 : ముదిరిన వివాదం కాంగ్రెస్ కు అల్టిమేటం
కాంగ్రెస్ పార్టీకి జీ-23 స్ట్రాంగ్ అల్టిమేటం జారీ
Congress G-23 : దేశంలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన పార్టీగా గుర్తింపు పొందిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆపార్టీ సీనియర్లు నాయకత్వంపై ఎక్కు పెట్టారు. ప్రధానంగా గాంధీ ఫ్యామిలీని టార్గెట్ చేశారు.
ఇప్పటికే జీ-23(Congress G-23 )పేరుతో మీటింగ్ నిర్వహించారు. దీనికి సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ నాయకత్వం వహిస్తున్నారు.
ఆయన ఇటు కాంగ్రెస్ లో పొగ పెడుతూనే మరో వైపు బీజేపీతో టచ్ లో ఉన్నారంటూ ఆ పార్టీకి చెందిన గాంధీ విధేయులు ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం నరేంద్ర మోదీ నేతృత్వంలోని మోదీ త్రయం ( మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా ) ఆక్టోపస్ లా దేశ వ్యాప్తంగా అల్లుకు పోయింది.
కేవలం 20 ఏళ్లలో ఆ పార్టీ ఊహించని రీతిలో దూసుకు పోతోంది.
తాజాగా ఇటీవల దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా తుడుచుకు పెట్టుకు పోయింది కాంగ్రెస్ పార్టీ.
దీనికి బాధ్యత వహిస్తూ తప్పుకోవాలంటూ ప్రముఖ లాయర్, సీనియర్ లీడర్ కపిల్ సిబల్ డిమాండ్ చేశారు.
ఎన్నికల అనంతరం గాంధీ ఫ్యామిలీపై అన్ని వైపులా విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి.
గాంధీ విధేయుల వర్గం ఓ వైపు గాంధీ ఫ్యామిలీ వ్యతిరేక వర్గం మరో వైపు చీలి పోయాయి.
తాజాగా జీ-23 సీనియర్ నేతలు ఢిల్లీ వేదికగా భేటీ అయ్యారు. ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీకి స్ట్రాంగ్ అల్టిమేటమ్ ఇచ్చారు.
తమతో కలిసి నడిస్తేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు.
లేక పోతే పార్టీకి భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి వెళ్లాలని సూచించారు.
ఉమ్మడి నిర్ణయాలతోనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు.
ఏ ఒక్కరితో ఆధారపడకుండా సమిష్టి నాయకత్వంతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆజాద్ నివాసంలో జరిగిన భేటీలో ఆనంద్ శర్మ, సిబల్ , శశి థరూర్, చవాన్,
మనీశ్ తివారీ, భూపిందర్ సింగ్ హూడా, రాజ్ బబ్బర్, సందీప్ దీక్షిత్ పాల్గొన్నారు. తాజాగా వీరితో పాటు మరికొందరు చేరడం విశేషం. వారిలో ఎంపీ ప్రణీత్ కౌర్ , గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా, మాజీ కేంద్ర మంత్రి మణిశంకర్ , మాజీ స్పీకర్ కుల్దీప్ శర్మ ఉన్నారు.
మొత్తంగా కాంగ్రెస్ పార్టీ చీలి పోకుండా జాగ్రత్త పడుతూనే పక్కలో బల్లెంలా తయారయ్యారు వీరు. కాగా రాజ్యసభ ఎంపీ మల్లికార్జున్ ఖర్గే సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీని విడగొట్టేందుకే జీ23 నేతలు యత్నిస్తున్నారంటూ ఆరోపించారు.
Also Read : బీజేపీ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణే