#Tollywood : నాకు దారి చూపింది వేటూరి గారే – బండారు దానయ్య

Tollywood : రచయితలు దర్శకులవ్వడం చాలాకాలంగా ఉన్నదే. కానీ గీత రచయితలు సైతం మెగా ఫోన్ పట్టడం ఇటీవలే మొదలైంది. ప్రముఖ గీత రచయిత బండారు దానయ్య కవి దర్శకుడిగా రూపొందిస్తున్న రెండో చిత్రం 'చిత్రపటం కథ'.

Tollywood : రచయితలు దర్శకులవ్వడం చాలాకాలంగా ఉన్నదే. కానీ గీత రచయితలు సైతం మెగా ఫోన్ పట్టడం ఇటీవలే మొదలైంది. ప్రముఖ గీత రచయిత బండారు దానయ్య కవి దర్శకుడిగా రూపొందిస్తున్న రెండో చిత్రం ‘చిత్రపటం కథ’.

ఈ సందర్భంగా తన కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ “సినిమా పరిశ్రమలో ఎన్నో అనుభవాలు, అవమానాలు ఎదుర్కొనాను. స్వర్గీయ వేటూరి సుందర రామూర్తి నాకు స్ఫూర్తి. నా పాటలపై వేటూరి ప్రభావం ఉంటుంది” అంటూ తన మనసులో భావాలు పంచుకున్నారు.

మీ నేపథ్యం గురించి చెప్పండి ?
మాది నల్గొండ. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటూ సినిమాల్లో పాటల రచయితగా నా ప్రయాణం ప్రారంభించాను. ఇక్కడ ఎన్నో నేర్చుకున్నాను ఇందులోనే స్థిరపడాలనేది నా ఆశ . సినిమాలో మంచి గేయ రచయితగా ప్రశంసలు అందుకున్నాను. విక్రమార్కుడు సినిమాలోని పాటకు మంచి గుర్తింపు వచ్చింది. నాకు వేటూరి గురువుగా వుంటూ ఓనమాలు నేర్పి పాటలు రాయడానికి ప్రోత్సహహించారు. మొదటి చిత్రం డాటర్ ఆఫ్ బుచ్చిరెడ్డి తో దర్శకుడిగా మారాను. నాకు సినిమాలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు. అనుభవాలే నా చిత్రాలకు కథలు.

మీ చిత్రపటం సినిమా గురించి చెప్పండి ?
నేను కథ, మాటలు, స్క్రిన్ ప్లే, సంగీతం, దర్శకత్వం వంటి శాఖలు నా భుజాల మీద వేసుకుని ఈ చిత్రం రూపొందించా,
‘‘విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో జరిగే యూత్ & ఫ్యామిలీ సబ్జెక్ట్ ఇది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అందమైన లోకేషన్లలో చిత్రీకరణ జరిపాం. . తండ్రి కూతురు మధ్య జరిగే ఎమోషన్ కథ. ఇంటర్నెట్ సెల్ ఫోన్ లేని కొత్త విషయాలను ఇందులో చూపిస్తున్నాము. ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసే అంశాలతో, యూత్‌ని ఆకట్టుకునే సంగీతంతో ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను

సినిమాలో న‌టిస్తున్న వారి గురించి చెప్పండి
ఇందులో పోసాని కృష్ణ మురళి, నారాయణ్, శరణ్య, శ్రీవల్లి , నారెన్, బాహుబలి ప్రభాకర్ వంటి సీనియర్ ఆర్టిస్టులందరూ ఈ సినిమాలో నటిస్తున్నారు అలాగే కోట శ్రీనివాసరావు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఇందులో 7 పాటలు ఉన్నాయి. త్వరలో చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది”!!

 

No comment allowed please