Robin Uthappa : ఐపీఎల్ వేలం ప‌ద్ద‌తి మారాలి

రాబిన్ ఉత‌ప్ప తీవ్ర అసంతృప్తి

Robin Uthappa : భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి – బీసీసీఐ నిర్వ‌హించిన ఐపీఎల్ మెగా వేలంపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశాడు భార‌త మాజీ క్రికెట‌ర్ రాబిన్ ఉత‌ప్ప‌(Robin Uthappa). ఒక ర‌కంగా ఇది ప‌శువుల సంత‌లాగా మారింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు.

తానే ఇంత‌గా ఫీల్ అయితే మిగ‌తా ఎంపిక కాని క్రికెట‌ర్ల ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాల‌ని పేర్కొన్నాడు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐపీఎల్ ప‌ద్ద‌తిని మార్చాల‌ని సూచించాడు.

ఉతప్ప‌ను చెన్నై సూప‌ర్ కింగ్స్ తీసుకుంది. సీఎస్కే విజ‌యాల‌లో కీల‌క పాత్ర పోషిస్తూ వ‌చ్చిన సురేష్ రైనాకు చుక్కెదురైంది. ఉత‌ప్ప అదృష్టం బాగుండి ఈసారి ఎంపిక‌య్యాడు.

మొత్తం 590 మందిని ఎంపిక చేస్తే అందులో 204 మందిని మాత్ర‌మే ఎంపిక చేసుకున్నాయి. రూ. 551 కోట్ల 70 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేశాయి ఫ్రాంచైజీలు. కాగా ఉత‌ప్ప‌ను రూ. 2 కోట్ల‌కు తీసుకుంది సీఎస్కే.

తాను బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ మెగా వేలానికి ఓ ప‌శువుల సంతకు వెళ్లిన‌ట్లు వెళ్లాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఎగ్జామ్ రాసిన త‌ర్వాత ఫ‌లితం కోసం వేచి చూసిన‌ట్లు చూడాల్సి వ‌చ్చింద‌ని వాపోయాడు ఉత‌ప్ప‌(Robin Uthappa).

ఇప్ప‌టికైనా బీసీసీఐ పెద్ద‌లు మారాల‌ని కోరాడు. ఎవ‌రి ప్ర‌తిభ ఏమిటో తెలుస‌ని ఇలాంటి వేలం పాట వ‌ల్ల ఎంపిక కాని వారు తీవ్ర నిరాశ‌కు లోన‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించాడు.

ఇందు వ‌ల్ల మంచి టాలెంట్ కోల్పోయే అవకాశం ఉంద‌న్నాడు. మూస ప‌ద్ద‌తికి స్వ‌స్తి ప‌లకాల‌ని కోరాడు. చాలా కాలం నుంచి ఆడుతున్న వాళ్లు అమ్ముడు పోక పోతే దారుణంగా ఉంటుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

Also Read : వీడ‌ని బంధం ఆట శాశ్వ‌తం

Leave A Reply

Your Email Id will not be published!