NV Ramana : జడ్జి ఇతర విషయాలపై ఫోకస్ పెట్టారు
సీజేఐ ఎన్వీ రమణ ఆసక్తిర వ్యాఖ్యలు
NV Ramana : కర్ణాటక సీనియర్ పోలీస్ చీఫ్ సీమంత్ కుమార్ సింగ్ , బ్యూరో క్రాట్ జె. మంజునాథ్ లకు ఊరటనిస్తూ మాజీలను కళంకిత అధికారిగా పేర్కొంటూ కర్ణాటక హైకోర్టు చేసిన పరిశీలనపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్. వి. రమణ(NV Ramana) బెయిల్ విషయంపై తాజాగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టును ఆదేశించారు. ఆ పరిశీలనలు కేసుతో సంబంధం లేనివని, విచారణల పరిధిలోకి రాదని స్పష్టం చేశారు.
విచారణ జరుగుతున్న కేసుతో అవినీతి నిరోధక శాఖ అధికారి ప్రవర్తనకు సంబంధం లేదు. బెయిల్ దరఖాస్తును పరిగణలోకి తీసుకోవడం కంటే న్యాయమూర్తి సంబంధితం కాని , పరిధికి మించిన ఇతర విషయాలపై దృష్టి సారించారంటూ పేర్కొన్నారు.
ప్రస్తుతం సీజేఐ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. లంచం కేసు విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి హెచ్ . పి. సందేశ్ చేసిన ప్రతికూల వ్యాఖ్యలను బహిష్కరించాలని కోరుతూ కర్ణాటక అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సీమంత్ కుమార్ సింగ్, ఐఏఎస్ అధికరాఇ జె. మంజునాథ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
లంచం కేసులో బెంగళూరు అర్బన్ డిప్యూటీ కమిషనర్ గా ఉన్న మంజునాథ్ ను ఎందుకు నిందితుడిగా చేర్చ లేదని జస్టిస్ సందేశ్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.
తన వ్యాఖ్యల తర్వాత జడ్జికి బదిలీ బెదిరింపు వచ్చింది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా న్యాయమూర్తి చేసిన కామెంట్స్ చర్చకు దారి తీశాయి. రాష్ట్రంలో నెలకొన్న అవినీతి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
Also Read : నామినేషన్ దాఖలు చేసిన జగ దీప్