Ramanujacharya : ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 210 అడుగుల శ్రీ రామానుజాచార్యుల విగ్రహం మహోత్సవం ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని శ్రీరామనగరం లో శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి(Ramanujacharya) ఆధ్వర్యంలో కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.
భారీ ఎత్తున నలు దిశల నుంచి భక్తులు తరలి వచ్చారు. 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. ఈనెల 14 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి.
ఈనెల 5న ప్రధాని మోదీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సకల సదుపాయాలు కల్పించారు. 7 వేల మంది భద్రతా సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. 12 రోజుల పాటు చిన్నజీయర్ స్వామి వారి పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు జరుగుతాయి.
వేలాది మంది వాలంటీర్లు , రుత్విక్కులు, ఇతర ప్రముఖుల రాకతో ముచ్చింతల్ ప్రాంగణం ఉత్సవ శోభను సంతరించుకుంది. శ్రీ రామానుజుడు బోధించిన తిరుమంత్ర జపంతో సహస్రాబ్ది ఉత్సవం ప్రారంభమైంది.
సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రారంభోత్సవానికి అంకురార్పణ జరిగింది. 1035 కుండాలతో కూడిన లక్ష్మీ నారాయణ మహా యాగం ముస్తాబైంది. ఈ సందర్భంగా భూమి పూజ, వాస్తు పూజ చేశారు.
5 వేల మంది రుత్వికులు దీక్షధారణ చేసి పూజల్లో పాల్గొంటున్నారు. రూ. 1000 కోట్లతో రూపుదిద్దుకున్న ఈ అద్భుత దివ్య క్షేత్రం భక్తులకు కనువిందు చేస్తోంది.
జీయర్ స్వామి ఆశ్రమ ప్రాంగణంలోని 45 ఎకరాలలో ఈ సమతామూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున విరాళాలు అందజేశారు. దీంతో పాటు చుట్టూ రియల్ ఎస్టేట్ బూమ్ ఊపందుకుంది.
ప్రధాని మోదీ ప్రారంభిస్తుండడంతో ఈ ప్రాంతానికి మరింత విశిష్టత చేకూరనుంది. మొత్తంగా రియల్ ఎస్టేట్ నిర్వాహకులు, పెట్టుబడిదారులకు ముచ్చింతల్ ఒక స్వర్గ ధామంగా మారనుందనడంలో అతిశ యోక్తి లేదు.
Also Read : సమతామూర్తి తిరుమంత్రం జీవన వేదం