Rythu Bharosa Kendram : రైతు భ‌రోసా కేంద్రాల ప‌నితీరు భేష్

సంద‌ర్శించిన ఇథోపియ‌న్ బృందం

Rythu Bharosa Kendram : ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో వైసీపీ కొలువు తీరాక సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కీల‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. విద్య‌, వైద్యం, ఉపాధి, ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు, మహిళా సాధికార‌త‌, ఐటీ రంగాల‌పై ఎక్కువ ఫోక‌స్ పెడుతున్నారు. ప్ర‌ధానంగా వ్య‌వ‌సాయ రంగానికి అధిక ప్రాధాన్య‌త ఇస్తున్నారు.

దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఏపీలో రైతుల కోసం రైతు భ‌రోసా కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయాన్ని లాభ‌దాయక‌మైన వెంచ‌ర్ గా మార్చింది. పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఆర్బీకేల‌ను ఏర్పాటు చేసింది. రైతుల‌కు అన్ని విధాలుగా సేవ‌లు అందిస్తోంది.

ఇక్క‌డే వ్య‌వ‌సాయానికి సంబంధించిన ప‌రిక‌రాలు, ఎరువులు, ఇత‌ర ప‌నిముట్ల‌ను పంపిణీ చేస్తోంది. దేశానికే ఆర్బీకేలు ఆద‌ర్శప్రాయంగా మారాయి. రైతు అవ‌స‌రాల‌ను తీర్చ‌డంలో కీల‌కంగా మారాయి. తాజాగా రైతు భ‌రోసా కేంద్రాలు(Rythu Bharosa Kendram) అంత‌ర్జాతీయ దృష్టిని ఆక‌ర్షించాయి.

దేశంలోని ఆర్బీకేల‌ను అధ్య‌య‌నం చేసేందుకు ఇథియోపియా వ్య‌వ‌సాయ శాఖ మంత్రి డాక్ట‌ర్ మెలెస్ మెకోనెన్ యిమెర్ నేతృత్వంలోని బృందం ఏపీని ఇటీవ‌ల సంద‌ర్శించింది. అద్భుత‌మంటూ ప్ర‌శంస‌లు కురిపించింది. ఈ మేర‌కు ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని క‌లిసింది.

వ్య‌వ‌సాయ‌, ఉద్యాన‌వ‌న ఉన్న‌తాధికారుల‌ను కూడా క‌లిసింది. ఈ సంద‌ర్భంగా ఎంపీ విజ‌య సాయి రెడ్డి ట్వీట్ చేశారు ఆర్బీకేల గురించి. ఏపీకి చెందిన రైతు భ‌రోసా కేంద్రాల‌పై ఇథియోపియా ప్ర‌తినిధి టీం అద్భుత‌మంటూ కితాబు ఇచ్చింద‌ని పేర్కొన్నారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా రైతుల సంక్షేమ‌మే ధ్యేయంగా త‌మ ప్ర‌భుత్వం ప‌ని చేస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు ఎంపీ.

Also Read : ఈవీ ఛార్జింగ్ స్టేష‌న్ల ఏర్పాటు – బీపీసీఎల్

Leave A Reply

Your Email Id will not be published!