Chetan Sharma Samson : శాంసన్ ఎంపికపై ఒత్తిడి నిజం
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ
Chetan Sharma Samson : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్ సెలెక్టర్ , మాజీ భారత జట్టు స్టార్ పేసర్ చేతన్ శర్మ సంచలన ఆరోపణలు చేయడం కలకలం రేపింది. ప్రపంచ క్రికెట్ లో ఒక్కసారిగా బీసీసీఐలో ఏం జరుగుతుందనే దానిపై బట్ట బయలు అయ్యింది.
నిన్నటి దాకా బీసీసీఐ బాస్ గా ఉన్న సౌరవ్ గంగూలీ వెళ్లి పోయాక ఆయన స్థానంలో కర్నాటకకు చెందిన మాజీ భారత జట్టు క్రికెటర్ రోజర్ బిన్నీ చీఫ్ గా ఎన్నికయ్యాడు. ఇటీవలే బీసీసీఐ సెలెక్షన్ కమిటీని ఎంపిక చేసింది.
ఓ ప్రైవేట్ ఛానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో చేతన్ శర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రధానంగా క్రికెటర్లు ఫిట్ నెస్ కోసం నకిలీ ఇంజెక్షన్లు తీసుకుంటారని ఆరోపించాడు. ప్రస్తుతం చేతన్ శర్మ దేశంలో హాట్ టాపిక్ గా మారాడు. అన్ ఫిట్ గా ఉన్న క్రికెటర్లు తాము ఫిట్ గా ఉన్నామని నిరూపించు కునేందుకు ఇలాంటివి చేస్తుంటారని పేర్కొన్నాడు చేతన్ శర్మ.
భారత క్రికెట్ లో గత కొంత కాలంగా కేరళ స్టార్ క్రికెటర్, హిట్టర్ గా పేరొందిన సంజూ శాంసన్ విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది బీసీసీఐ. ప్రధానంగా రిషబ్ పంత్ ను కంటిన్యూ చేయడం, ఫామ్ లో లేక పోయినా వరుసగా ఎంపిక చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు మాజీ క్రికెటర్లు , ఫ్యాన్స్.
ఇదిలా ఉండగా శాంసన్ ఎంపిక(Chetan Sharma Samson) విషయంలో బీసీసీఐతో పాటు సెలెక్షన్ కమిటీ కూడా తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటోందని స్పష్టం చేశాడు చేతన్ శర్మ.
Also Read : ఫిట్ నెస్ కోసం ఇంజెక్షన్లు – చేతన్ శర్మ