KK Singer : వెచ్చని జ్ఞాపకం స్వర మాధుర్యం
సెలవంటూ వెళ్లి పోయిన కేకే
KK Singer : సంగీత ప్రపంచంపై తనదైన ముద్ర వేస్తూ వేలాది మంది గుండెల్ని మీటిన కేకే ఉన్నట్టుండి ఇక సెలవంటూ వెళ్లి పోయాడు. ఈ గాయక దిగ్గజం చివరి మజిలీ కూడా తాను అమితంగా ఇష్టపడే సంగీత కచేరి చేసి ఇక పాడలేనంటూ నిష్క్రమించాడు.
కేవలం కేకే(KK Singer) వయసు 53 ఏళ్లు మాత్రమే. ఎన్నో విజయవంతమైన సినిమాలకు ఆయన పాటలు పాడారు. గుర్తుంచుకునేలా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. కేకే పూర్తి పేరు కృష్ణకుమార్ కున్నాత్. 23 ఆగస్టు 1968లో ఢిల్లీలో పుట్టారు.
యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీలో చదివాడు కేకే. 1994 నుంచి 2022 దాకా సినీ రంగంలో పాటలు పాడుతూ, సంగీత కచేరీలు చేస్తూ సాగాడు. భారతీయ పాప్ సింగర్ గా, రాక్ , బాలీవుడ్ లో పేరు పొందాడు.
కేకే పలు భాషల్లో ఎన్నో పాటలు పాడారు. ప్రధానంగా కేకే పాడిన పాటలు ఎక్కువగా హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ,
బెంగాలీ, అస్సామీ, గుజరాతీ భాషలలో పాడారు.
కేకే తన కెరీర్ ను అడ్వర్టైజ్ మెంట్ జింగిల్స్ కు పాడటం ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. సినీ సంగీత దిగ్గజ దర్శకుడు అల్లా రఖా రహమాన్ కేకేను
సినిమాల్లోకి పాటలు పాడేలా తీసుకు వచ్చాడు.
1999లో పాల్ పేరుతో తన తొలి ఆల్బంను ప్రారంభించాడు. యారోన్ సాంగ్స్ నోటెడ్. కేకే(KK Singer) పాడిన పాటల్లో దేశాన్ని ఉర్రూతలూగించిన
పాటల్లో హమ్ దిల్ దేచుకే సనమ్ లో తడప్ తడప్ సాంగ్ సూపర్ హిట్ గా నిలిచింది.
తమిళంలో ఆపడి పోడు, డోలా రే డోలా , క్యా ముజే ప్యార్ హై , ఓం శాంతి ఓం , ఆంఖోన్ మే తేరీ , ఖుదా జానే , పియా ఆయే నా , మత్ ఆజా్మ రే ,
తు జో మిలా తదితర సాంగ్స్ హిట్స్ గా నిలిచాయి.
గుండెల్లో గూడు కట్టుకునేలా చేశాయి. కేకే ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నాడు. సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది. కేకే పేరెంట్స్
మలయాళీలు. సీఎస్ మీనన్ , కున్నత్ కనకల్లి. కేకే 3, 500 కు పైగా జింగిల్స్ పాడాడు.
1999 క్రికెట్ వరల్డ్ కప్ సందర్భంగా భారత క్రికెట్ జట్టుకు మద్దతు తెలిపేందుకు గాను జోష్ ఆఫ్ ఇండియా సాంగ్ పాడాడు. కేకే ఇద్దరు పిల్లలు. కేకే ఎవరి వద్దా సంగీత శిక్షణ తీసుకోలేదు.
Also Read : గాయక దిగ్గజం మూగ బోయిన స్వరం