Sakshi Malik Punia : పనిలో చేరినా పోరాటం ఆగదు
మహిళా రెజ్లర్ల కీలక ప్రకటన
Sakshi Malik Punia : అగ్రశ్రేణి రెజ్లర్లు మళ్లీ పనిలో చేరారు. ఈ మేరకు నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు సాక్షి మాలిక్(Sakshi Malik). ఇదిలా ఉండగా మాలిక్ తో పాటు వినేష్ ఫోగట్ , బజరంగ్ పునియా మే 31 నుండి తమ పనిని పునః ప్రారంభించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టిన రెజ్లర్లను ఢిల్లీ ఖాకీలు తరిమి కొట్టారు. వీరు తిరిగి రైల్వేలలో తమ విధులను ప్రారంభించారు.
మాలిక్ , పునియా ఇద్దరూ నిరసన నుండి విరమించుకున్నట్లు సాగిన ప్రచారాన్ని ఖండించారు. ఇది న్యాయం కోసం పోరాటం. వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. మేము రైల్వేలో మా విధులను తిరిగి ప్రారంభించాని తెలిపారు. అయితే తమ భవిష్యత్తు వ్యూహంపై కూడా పని చేస్తున్నామన్నారు.
మైనర్ తో సహా ఏడుగురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై నిష్పక్ష పాత దర్యాప్తు కోసం రెజ్లర్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాను కలుసుకున్నారు. చట్టం అందరికీ ఒకేలాగా ఉంటుందని షా చెప్పినట్లు సమాచారం.
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ ను అరెస్ట్ చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని రెజ్లర్లు చెప్పారు. అయితే కేంద్రం ఉదాసీన వైఖరిని ప్రదర్శించిందని , బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకునేందుకు వెనుకంజ వేసిందంటూ ఆరోపించారు. ఇదే సమయంలో తమ పతకాలను గంగలో నిమజ్జనం చేయాలని నిర్ణయించారు.
Also Read : Lloyd Austin : భారత్ అమెరికా రోడ్ మ్యాప్ సిద్దం