గ‌డువు లోగా ప‌నులు పూర్తి చేయాలి : చంద్ర‌బాబు

లేక‌పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ స్ట్రాంగ్ వార్నింగ్

అమ‌రావ‌తి : తాను దేనినైనా ఒప్పుకుంటాను కానీ ప‌నుల ప్ర‌గ‌తి విష‌యంలో తాత్సారం వ‌హిస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదంటూ స్ప‌ష్టం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఆయ‌న స‌చివాల‌యంలో రాష్ట్రంలో జ‌రుగుతున్న ప్రాజెక్టుల‌కు సంబంధించి స‌మీక్ష చేప‌ట్టారు. ఈ కీల‌క స‌మావేశానికి మంత్రులు మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్ధసారధి, నాదెండ్ల మనోహర్, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు జల వనరుల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు హాజ‌ర‌య్యారు. ఎప్పుడో పూర్తి కావాల్సిన పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు ఇంకా ఎందుకు ఆల‌స్యం అవుతున్నాయంటూ నిల‌దీశారు. దీనికి స‌మాధానం చెప్పేందుకు ప్ర‌య‌త్నం చేశారు నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు. ప‌నులు త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు.

ప్రాజెక్టులో 87 శాతం మేర సివిల్ పనులు పూర్తి అయ్యాయని ఈ సంద‌ర్బంగా చెప్పారు. అయితే గడువులోగా మిగతా పనులు పూర్తి చేయాలని సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశించారు. ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం, ఆర్ అండ్ ఆర్ పనులపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని స్ప‌ష్టం చేశారు.పునరావాసం, ఆర్ అండ్ ఆర్ పనులపై యాక్షన్ ప్లాన్ రూపొందించు కోవాల‌ని అన్నారు. అంతే కాకుండా
పోలవరం ఎడమ కాలువ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం నిధుల‌ను మంజూరు చేసింద‌ని చెప్పారు. ఇంకా ఏమైనా కావాల్సి వ‌స్తే మంజూరు చేసేందుకు సిద్దంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు నారా చంద్ర‌బాబు నాయుడు.

Leave A Reply

Your Email Id will not be published!