Sanjay Raut : మరాఠాలో ప్రభుత్వం లేదు – సంజయ్ రౌత్
సంచలన కామెంట్స్ చేసిన ఎంపీ
Sanjay Raut : శివసేన జాతీయ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి , రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) సంచలన కామెంట్స్ చేశారు. మరాఠాలో ప్రభుత్వం అన్నది లేదని ఆరోపించారు.
అక్రమ పద్దతిలో ఏర్పాటైన షిండే, భారతీయ జనతా పార్టీ సర్కార్ ను తాము గుర్తించడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితిలో ఓ వైపు వర్షాలతో తల్లడిల్లుతుంటే సీఎం, డిప్యూటీ సీఎంలు నిద్ర పోతున్నారంటూ ఎద్దేవా చేశారు.
చట్ట విరుద్దమైన ప్రభుత్వానికి ఎలాంటి గుర్తింపు లేదన్నారు. శివసేన పార్టీ గుర్తుతో గెలుపొందిన వారు ఉన్నట్టుండి మోసం చేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలను మరాఠా ప్రజలు క్షమించరని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తుంటే గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ ఎక్కడ ఉన్నారంటూ సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ముంబైలో శివసేన ఎంపీ మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో కలరా విజృంభిస్తోందని దాని వల్ల మరణాలు సంభవిస్తున్నా ప్రభుత్వం పట్టించు కోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సంజయ్ రౌత్. మరాఠాలో మళ్లీ లాక్ డౌన్ చోటు చేసుకుంది.
వరదల కారణంగా 100 మందికి పైగా మరణించారని చెప్పారు. కేవలం ప్రభుత్వ లెక్కల ప్రకారం గత జూన్ 1 నుంచి జూలై 10 దాకా వర్షాలకు సంబంధించిన సంఘటనల కారణంగా 83 మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు సంజయ్ రౌత్.
ఆ ఇద్దరు తప్ప మంత్రివర్గం ఎక్కడుందని ప్రశ్నించారు. నిన్నటి దాకా అక్రమ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ కీలక పాత్ర పోషించిన గవర్నర్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు సంజయ్ రౌత్.
Also Read : అహ్మదాబాద్ కు అరుదైన గౌరవం