TSPSC Exams Cancelled : రద్దయిన టీఎస్పీఎస్సీ పరీక్షలు ఇవే
సిట్ తో కాదు సీబీఐతో విచారణ చేపట్టాలి
TSPSC Exams Cancelled : నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బి. జనార్దన్ రెడ్డి. పేపర్ లీక్ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. శుక్రవారం గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను కూడా రద్దు చేసినట్లు ప్రకటించారు. సిట్ విచారణలో ఈ విషయం వెలుగు చూసిందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఏయే పరీక్షలు రద్దయ్యాయో(TSPSC Exams Cancelled) ఇక్కడ ఉన్నాయి. టీఎస్ పీస్సీలో ఇప్పటి దాకా 35 లక్షల మంది నమోదు చేసుకున్నారు.
జనవరి 10న 1392 పోస్టులకు సంబంధించి జనవరి 10న నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. లీక్ కారణంగా దీనిని కూడా రద్దు చేసింది టీఎస్పీఎస్సీ. ఇక 833 ఏఈ పోస్టులకు 50 వేల మంది దరఖాస్తు చేసుకుంటే మార్చి 5న దీనిని నిర్వహించారు. ఈ పరీక్ష కూడా లీక్ అయ్యిందని దానిని కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పరీక్షతో పాటు 175 టౌన్ ప్లానింగ్ అధికారుల పోస్టులను కూడా రద్దు చేసినట్లు తెలిపారు చైర్మన్ బి. జనార్దన్ రెడ్డి.
ఇక ఎంవీఐ జాబ్స్ కు సంబంధించి 113 పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. పేపర్ లీక్ వల్ల దీనిని కూడా రద్దు చేసినట్లు తెలిపారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరీక్షను కూడా రద్దు చేశారు.
ఇక గ్రూప్ -1 పరీక్ష ప్రిలిమ్స్ ను కూడా రద్దు(TSPSC Exams Cancelled) చేస్తున్నట్లు వెల్లడించారు జనార్దన్ రెడ్డి. ఇదిలా ఉండగా డివిజన్ అకౌంట్ ఆఫీసర్ (డీఏఓ) పరీక్షను కూడా టీఎస్ పీస్సీ రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. 53 పోస్టులకు లక్షకు పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష గత నెల 26న జరిగింది.
Also Read : ఐఐటీ హైదరాబాద్ లో జాబ్స్