IPL 2022 Finals Squads : ఐపీఎల్ ఫైన‌ల్ పోరులో తుది జ‌ట్లు ఇవే

గుజ‌రాత్ టైటాన్స్ వ‌ర్సెస్ రాజ‌స్తాన్ రాయ‌ల్స్

IPL 2022 Finals Squads : గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ మోదీ స్టేడియంలో ఆదివారం జ‌రిగే తుది (ఫైన‌ల్ ) పోరుకు సిద్ద‌మ‌య్యాయి గుజ‌రాత్ టైటాన్స్ , రాజ‌స్తాన్ రాయ‌ల్స్(IPL 2022 Finals Squads). ఇరు జ‌ట్ల ప‌రంగా అద్భుత‌మైన ఆట‌గాళ్లు ఉన్నారు.

క్వాలిఫ‌యిర్ -1 లో త‌ల‌ప‌డిన తుది జ‌ట్టునే ఎంపిక చేసే చాన్స్ ఎక్కువ‌గా ఉంది గుజ‌రాత్ కు. ఇక రాజ‌స్తాన్ కూడా ఒక‌టి లేదా రెండు

మార్పులు చేయొచ్చ‌ని స‌మాచారం. మొత్తంగా చూస్తూ పూర్తి జ‌ట్లు ఇలా ఉన్నాయి.

గుజ‌రాత్ టైటాన్స్ కు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ఉన్నాడు. వృద్దిమాన్ సాహా, శుభ‌మ్ గిల్ ఓపెన‌ర్లుగా వ‌స్తారు. ఇక మ్యాథ్యూ వేడ్ , రాహుల్ తెవాటియా మిడిల్ ఆర్డ‌ర్ లో వ‌స్తారు. ఇక ఫినిష‌ర్ గా ఇప్ప‌టికే పేరొందిన స్టార్ హిట్ట‌ర్ డేవిడ్ మిల్ల‌ర్ వ‌స్తాడు.

ఇక ఏ మాత్రం జంకు లేకుండా ఆడే ఆఫ్గ‌నిస్తాన్ స్టార్ ఆలౌ రౌండ‌ర్ , లెగ్ స్పిన్న‌ర్ గుజ‌రాత్ జ‌ట్టుకు వైస్ కెప్టెన్ గా ఉన్న ర‌షీద్ ఖాన్ ఆడ‌తాడు. నిప్పులు చెరిగే బంతుల‌తో ఇబ్బంది పెట్టే సాయి కిషోర్ , జోసెఫ్ , ష‌మీ ఉన్నాడు.

ఇక య‌శ్ ద‌యాల్ గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. ఇక రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్టు ప‌రంగా చూస్తే ఆ జ‌ట్టు దుర్బేద్యంగా ఉంది. ఒక్క జోస్ బ‌ట్ల‌ర్

చాలు ఆ జ‌ట్టును గెలిపించేందుకు.

పానీ పూరీ కుర్రాడు య‌శ‌స్వి జైశ్వాల్ , జోస్ బ‌ట్ల‌ర్ ఓపెన‌ర్లుగా వ‌స్తారు. స్టార్ హిట్ట‌ర్ వ‌న్ డౌన్ లో వ‌స్తాడు కెప్టెన్ సంజూ శాంస‌న్ . భ‌య‌మ‌న్న‌ది

లేకుండా ఆడే దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ , రియాన్ ప‌రాగ్ ఆడ‌తారు.

ఇక ఫినిష‌ర్ గా ఇప్ప‌టికే పేరొందిన స్టార్ హిట్ట‌ర్ సిమ్రోన్ హిట్ మెయిర్ ఉండ‌గా ఆల్ రౌండ‌ర్ గా పేరొందిన ర‌విచంద్ర‌న్ అశ్విన్

బ‌లంగా మార‌నున్నాడు.

ఇక బౌలింగ్ ప‌రంగా చూస్తే ప్ర‌సిద్ధ్ కృష్ణ‌, టెంట్ బౌల్ట్ , మెక్ కాయ్ , యుజ్వేంద్ర చాహ‌ల్ మ్యాచ్ ను తిప్ప‌గ‌ల స‌మ‌ర్థులు.

Also Read : ఆల్ రౌండ్ నైపుణ్యం అద్భుత విజ‌యం

Leave A Reply

Your Email Id will not be published!