Imran Khan Arrest : నన్ను చంపాలని చూస్తున్నారు
మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కామెంట్స్
Imran Khan Arrest Comments : మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం తనను చంపాలని చూస్తోందంటూ ఆరోపించారు. అందుకనే తనను అరెస్ట్ చేయాలని చూస్తోందన్నారు. తాను గనుక జైలుకు వెళితే తనను చంపుతారంటూ వాపోయాడు. ఈ మేరకు తన నివాసంలోంచి వీడియో మెస్సేజ్ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాగా కోర్టు ఆదేశాల మేరకు అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ముందుకు రావడంతో ఆయన మద్దతుదారులు రోడ్డెక్కారు.
లాహోర్ లో నివాసం ఉంటున్న ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ను అదుపు లోకి తీసుకునేందుకు భారీ ఎత్తున పోలీసులు వచ్చారు. దీంతో ఖాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున అడ్డుకునే ప్రయత్నం చేశారు. తాను జైలుకు వెళ్లిని లేదా చంపినా ప్రజల హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు ఇమ్రాన్ ఖాన్.
మాజీ ప్రధాని వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దాంతో మాజీ ప్రధాన మంత్రి నివాసం ముందు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసు సిబ్బందిపై రాళ్లు, ఇటుకలు విసిరారు. పరిస్థితి అదుపు తప్పడంతో వాటర్ క్యానన్లను ప్రయోగించారు పోలీసులు. నన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చారు. తాను గనుక జైలుకు వెళితే ప్రజలు నిద్ర పోతారని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఇది తప్పని మీరంతా నిరూపించాలని పిలుపునిచ్చారు.
మీ హక్కుల కోసం పోరాడాలి. మీరు వీధుల్లోకి రావాలి. దేవుడు ఇమ్రాన్ ఖాన్ కు (Imran Khan Arrest Comments ) అన్నీ ఇచ్చాడు. నేను మీ కోసం పోరాడూతనే ఉన్నాను. నేను జీవితమంతా పోరాడాను. నాకు ఏమైనా జరిగితే మీరు బాధ పడకండి. కానీ మీ హక్కుల కోసం మీరు పోరాడాలని కోరారు మాజీ ప్రధానమంత్రి.
Also Read : రాహుల్ వ్యాఖ్యలను వక్రీకరిస్తే ఎలా