IT Raids BBC 3rd day : బీబీసీ ఆఫీసుల్లో మూడో రోజు సోదాలు
కంటిన్యూగా ఐటీ దాడులతో కలకలం
IT Raids BBC 3rd day : కేంద్ర ఆదాయ పన్ను శాఖ వరుసగా దాడులతో హోరెత్తిస్తోంది. ఇప్పటికే బీబీసీకి చెందిన ఢిల్లీ, ముంబై ఆఫీసులలో సోదాలు చేపట్టింది. గురువారం నాటితో మూడో రోజు(IT Raids BBC 3rd day). ఇప్పటి వరకు 48 గంటలు పూర్తిగా గడిచాయి.
అయినా దాడులను ఆపడం లేదు ఐటీ శాఖ. గత నెల జనవరి 24న బీబీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మోదీ ది క్వశ్చన్ పేరుతో డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కేంద్రం. ఈ మేరకు సదరు ఎపిసోడ్ కు సంబంధించిన మొత్తం లింకులపై నిషేధం విధించింది.
ఎక్కడ కూడా ప్రసారం చేయకూడదంటూ ఆదేశించింది. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును కొందరు ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక్క ఎపిసోడ్ ప్రసారం చేయడం వల్ల ఎంత మేరకు ప్రభావితం చెందుతారంటూ ప్రశ్నించింది.
ఒక రకంగా నిలదీసింది. భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు అని దానిపై తాము జోక్యం చేసుకోలేమంటూ పేర్కొంది.
ఇదే సమయంలో ఇందుకు సంబంధించిన సమాచారం, డాక్యుమెంట్ రికార్డ్ లను తమ ముందు ఉంచాలంటూ ఆదేశించింది ధర్మాసనం. ఈ తరుణంలో కేంద్ర ఐటీ శాఖ దాడులకు పాల్పడడం విస్తు పోయేలా చేసింది. ఐటీ దాడులకు(IT Raids BBC) సంబంధించి తాము పూర్తిగా సహకరిస్తున్నామని స్పష్టం చేసింది బీబీసీ. ఇప్పటి వరకు బీబీసీ కథనంపై యావత్ ప్రపంచం విస్తు పోయింది.
ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన సోదాల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉండడం విశేషం.
Also Read : పెట్రోల్ వాత డీజిల్ మోత