#Akhila : 4 నిమిషాల్లో 51 మందిని ఇమిటేట్ చేసిన అఖిల

ఆడవారు కూడా చాలా ఈజీగా చేయగలరని ఏఎస్‌ అఖిల అనే అమ్మాయి నిరూపించింది.

Akhila : చాలామంది మిమిక్రీ చేస్తుంటే మనం చూస్తూనే ఉంటాం. మిమిక్రీ ఎక్కువుగా మగవారు మాత్రమే చేస్తుంటారు. ఆడవారు చాలా తక్కువ మంది మాత్రమే చేస్తారు. ఆడవారు కూడా చాలా ఈజీగా చేయగలరని ఏఎస్‌ అఖిల అనే అమ్మాయి నిరూపించింది. అఖిల మలయాళ అమ్మాయి. పుట్టింది, పెరిగింది అంత తిరువనంతపురం జిల్లా నేడుమంగడ్‌లో. ఆయుర్వేద వైద్యవిద్యను అభ్యసిస్తోంది.

అఖిలకు చిన్నప్పటి నుంచీ చుట్టూ ఉన్న పరిసరాలను, మనుషులను పరిశీలించడం అలవాటు. ఆ అలవాటు నుండే మిమిక్రి కళ బయటపడింది. స్కూల్లో ఉన్నప్పుడే క్లాస్‌ టీచర్స్‌ను, క్లాస్‌మేట్స్‌ను అనుకరిస్తూండేది. ఒకసారి మిమిక్రి చేస్తుంటే టీచర్ చూసి స్టేజ్ మీద ప్రదర్శించాలని చెప్పింది. దాంతో చిన్నప్పటి నుండే అఖిలకు(Akhila) స్టేజ్‌ ఫియర్‌ పోయి ధైర్యం వచ్చింది. ఎక్కడైనా ప్రదర్శనలు ఇవ్వగలననే ఆత్మవిశ్వాసమూ పెరిగింది.

రజినీకాంత్, కమల్‌హసన్, అద్నన్‌ సమీ, ఎస్‌. జానకి, ఓమెన్‌ చాందీ, వీఎస్‌ అచ్యుతానందన్ వంటి 100 కు పైగా స్టార్స్ గొంతులను మిమిక్రి చేస్తుంది. ఒక మలయాళం చానెల్‌లో వచ్చిన ప్రోగ్రామ్‌లో అఖిల నాలుగు నిమిషాల్లో యాభై ఒక్కమంది సెలబ్రిటీల స్వరాన్ని అనుకరించింది. ప్రతి నాలుగు సెకన్లకు ఆడ, మగ గొంతును మారుస్తూ చేసిన మిమిక్రి చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.

ఆ ఒక్క షో తో మిమిక్రీలో మహిళా సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది. ఇప్పటివరకు మలయాళంలో ఎంత మంది మిమిక్రీ కళాకారులు వచ్చినా.. తర్వాత వాళ్లంతా సినిమా ఆర్టిస్టులుగా స్థిరపడ్డారు. కాని అఖిల (Akhila)మాత్రం మిమిక్రీ కళాకారిణిగానే కొనసాగాలనుకుంటుందని చెబుతుంది.

No comment allowed please