Hardik Pandya : ముంబై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 లో ఉత్కంఠ భరితంగా సాగింది పంజాబ్ కింగ్స్ , గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ . మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 189 రన్స్ చేసింది.
అనంతరం బరిలోకి దిగిన గుజరాత్ 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. అయితే ఆఖరు ఓవర్ లో 19 రన్స్ చేయాల్సి ఉండగా నాలుగు బంతులకు 7 పరుగులు మాత్రమే వచ్చాయి.
ఇక రెండు బంతులు 12 రన్స్ చేస్తేనే గెలుపు సాధిస్తుంది. ఇక పంజాబ్ కింగ్స్ ఫుల్ జోష్ లో ఉంది. తాము గెలుపొందడం ఖాయమని ఫిక్స్ అయి పోయింది. కానీ ఉన్నట్టుండి రాహుల్ తెవాటియా రూపంలో షాక్ తగిలింది.
ఆ రెండు బంతుల్ని సిక్సర్లుగా మలిచాడు. దీంతో మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వశమైంది. ఒక రకంగా ఇది కోలుకోలేని దెబ్బ. ఆ షాక్ నుంచి ఇంకా తేరు కోలేదు పంజాబ్.
మ్యాచ్ అనంతరం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)మాట్లాడాడు. ఈ మ్యాచ్ పూర్తిగా ఆ ముగ్గురి వల్లే గెలిచామని చెప్పారు. 96 పరుగులు చేసిన శుభ్ మన్ గిల్, సాయి సుందర్శన్ 35 , ఆఖరున దంచి కొట్టిన రాహుల్ తెవాటియా అద్భుతంగా ఆడారంటూ ప్రశంసించాడు.
ఈ ముగ్గురు గనుక ఆడక పోయి ఉంటే తాము ఓటమి పాలయ్యే వారమని పేర్కొన్నాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్ పోటీల్లో వస్తూనే మూడు మ్యాచ్ లు గెలుపొందిన జట్టుగా పేరొందింది గుజరాత్ టైటాన్స్. ప్రస్తుతం ఈ మ్యాచ్ హాట్ టాపిక్ గా మారింది.
Also Read : అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు