Ravichandran Ashwin : ఈసారి ఐపీఎల్ కప్ మాదే ప‌క్కా

ధీమా వ్య‌క్తం చేసిన ర‌విచంద్ర‌న్ అశ్విన్

Ravichandran Ashwin : ఎలాంటి అంచ‌నాలు లేకుండానే ఐపీఎల్ 2022 రిచ్ టోర్నీలో ఎంట్రీ ఇచ్చి ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ప్లే ఆఫ్స్ కు చేరింది రాజ‌స్థాన్ రాయ‌ల్స్. కేర‌ళ స్టార్ హిట్ట‌ర్ సంజూ శాంస‌న్ సార‌థ్యంలోని ఆ జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు 14 మ్యాచ్ లు ఆడింది.

9 మ్యాచ్ ల‌లో విజ‌యం సాధించి 18 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. హెడ్ కోచ్ కుమార సంగ‌క్క‌ర‌, బౌలింగ్ కోచ్

ల‌సిత్ మ‌ళింగ ఆ జ‌ట్టు విజ‌యాలు సాధించేలా ప్లాన్ చేశారు.

వారి ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయి. ఆ జ‌ట్టు స‌త్తా చాటి ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు చుక్క‌లు చూపించింది. ప్ర‌స్తుతం టైటిల్ వేట‌లో నిలిచింది. కీల‌క మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో చెన్నై సూప‌ర్ కింగ్స్ పై విజ‌యం సాధించింది.

మొద‌ట బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 150 ప‌రుగులు చేసింది. ఇక బ‌రిలోకి దిగిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్

5 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసి స‌త్తా చాటింది.

పానీ కుర్రాడు య‌శ‌స్వి జైస్వాల్ దుమ్ము రేపాడు. త‌న జ‌ట్టు గెలుపులో కీల‌క పాత్ర పోషించాడు. ఆ త‌ర్వాత శాంస‌న్ , హిట్ మైర్ , ప‌డిక్క‌ల్

వికెట్ల‌ను వెంట వెంట‌నే కోల్పోయింది.

కానీ చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఆట‌గాళ్ల‌పై ఒత్తిడి పెంచ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. కానీ సీఎస్కే ఆశ‌ల‌పై

నీళ్లు చ‌ల్లాడు ఆల్ రౌండ‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్(Ravichandran Ashwin). 3 సిక్స‌ర్లు కొట్టాడు.

40 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. బౌలింగ్ ప‌రంగా రాణించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అశ్విన్(Ravichandran Ashwin) ను వ‌రించింది. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ఈసారి ఐపీఎల్ టైటిల్ త‌మ‌దేన‌ని, దానిని సాధించేంత దాకా తాము నిద్ర పోమ‌ని స్ప‌ష్టం చేశాడు.

Also Read : ఆ జ‌ట్టు స‌క్సెస్ వెనుక‌ ఆ ఇద్ద‌రు

Leave A Reply

Your Email Id will not be published!