Tilak Varma : చరిత్ర సృష్టించిన తెలంగాణ తేజం
ఆకట్టుకున్న హైదరాబాదీ తిలక్ వర్మ
Tilak Varma : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) 2022లో ఈసారి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత సీజన్ లో మెరిసిన ఆటగాళ్లు ఈసారి ఆకట్టుకోలేక పోయారు. కానీ కొత్త కుర్రాళ్లు సీనియర్లతో పోటీ పడి అద్భుతంగా రాణించారు.
వారిలో తాజా, మాజీ ఆటగాళ్లను ఎక్కువగా ఆకర్షించింది మాత్రం ముంబై ఇండియన్స్ కు చెందిన తిలక్ వర్మ(Tilak Varma). ఈ వర్మ ఎవరో కాదు పక్కా తెలంగాణలోని హైదరాబాదీ. పూర్తి పేరు నంబూరి తిలక్ వర్మ. ఐపీఎల్ లో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు మనోడు.
డెబ్యూ (ఎంట్రీ) సీజన్ లో అన్ క్యాప్ డ్ ప్లేయర్ గా ఎక్కువ పరుగులు చేసిన లిస్టులో తిలక్ వర్మ చోటు దక్కించుకున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టులో కీలకమైన ఆటగాడిగా ఎదిగాడు. చాలా మ్యాచ్ లలో జట్టు పరువు పోకుండా కాపాడాడు తిలక్ వర్మ.
ఐపీఎల్ సీజన్ లో తిలక్ వర్మ 14 మ్యాచ్ లు ఆడాడు. ఏకంగా 397 పరుగులు చేశాడు. ఇందులో కీలకమైన రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మొత్తం తాను ఆడిన ఇన్నింగ్స్ లలో 29 ఫోర్లు, 16 సిక్సర్లు ఉన్నాయి.
డెబ్యూ పరంగా చూస్తే 2008లో షాన్ మార్ష్ 616 రన్స్ చేశాడు. 2020 ఐపీఎల్ సీజన్ లో దేవదత్ పడిక్కల్ 473 రన్స్ చేశాడు. కోల్ కతా కెప్టెన్ గా ఉన్న శ్రేయస్ అయ్యర్ 2015 సీజన్ లో 439 పరుగులు చేశాడు.
తిలక్ వర్మ నాలుగో స్థానంలో నిలిచాడు. ఇక కీలకమైన ఆఖరి లీగ్ మ్యాచ్ లో సైతం కీలక ఇన్నింగ్స్ ఆడాడు తిలక్ వర్మ(Tilak Varma). మొత్తంగా ముంబై ఓడి పోయినా తిలక్ వర్మ ఆకట్టుకున్నాడు. హాట్ టాపిక్ గా మారాడు.
Also Read : హైదరాబాద్ పంజాబ్ ఆఖరి లీగ్ మ్యాచ్