Tim David : వణుకు పుట్టించిన టిమ్ డేవిడ్
సన్ రైజర్స్ బౌలర్లకు చుక్కలు
Tim David : ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కేవలం 3 పరుగులతో ఓడి పోయింది. చివరి దాకా సన్ రైజర్స్ తో పోరు ఉత్కంఠ భరితంగా సాగింది. 190 పరుగులే చేసింది. ప్రధానంగా చెప్పుకోవాల్సింది ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్న టిమ్ డేవిడ్(Tim David).
సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఒక రకంగా వణుకు పుట్టించాడు. బంతి రావడమే తరువాయి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రనౌట్ అయ్యాడు కాని లేక పోతే ముంబై సునాయసంగా విజయం సాధించి ఉండేది.
ఒక రకంగా హైదరాబాద్ డేవిడ్ మైదానంలో ఉన్నంత వరకు ఊపిరి పీల్చుకోలేదు. చివరి దాకా పోరాడింది సన్ రైజర్స్.
ఆఖరులో టిమ్ డేవిడ్(Tim David) దంచి కొట్టాడు.
పిడుగు ల్లాంటి షాట్స్ తో భయపడేలా చేశాడు. రోహిత్ శర్మ 36 బంతులు ఆడి 48 రన్స్ చేశాడు. ఇందులో 2 ఫోర్లు 4 సిక్సర్లు ఉన్నాయి. ఇషాన్ కిషన్ 34 బంతులు ఆడి 43 రన్స్ చేశాడు.
ఇందులో 5 ఫోర్లు ఒక సిక్సర్ ఉంది. ఇక టిమ్ డేవిడ్ వచ్చీ రాగానే దాడి చేశాడు. కేవలం 18 బంతులు మాత్రమే ఆడాడు. 46 రన్స్ చేశాడు. ఇందులో 3 ఫోర్లు 4 సిక్సర్లు ఉన్నాయి.
18 బంతులు 45 రన్స్ చేయాల్సిన సమయంలో నటరాజన్ ఓవర్ లో నాలుగు సిక్సర్లు కొట్టాడు టిమ్ డేవిడ్(Tim David). ఆఖరి బంతికి అనూహ్యంగా రనౌట్ కావడంతో హైదరాబాద్ గెలుపు సాధ్యమైంది.
టిమ్ డేవిడ్ పూర్తి పేరు తిమోతీ హేస్ డేవిడ్. 16 మార్చి 1996లో పుట్టాడు. వయస్సు 26 ఏళ్లు. స్వస్థలం సింగపూర్ . కుడి చేతి బ్యాటర్. 2019 నుంచి ఆడుతున్నాడు.
22 జూలై 2019 లో ఖతార్ తో టీ20 అరంగేట్రం చేశాడు. 2017 -2020 దాకా పెర్త్ స్కారర్స్ తరపున ఆడాడు. 2021లో లాహోర్ ఖలందర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి ఆడాడు. ఈ ఏడాది 2022లో ముంబై ఇండియన్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
Also Read : రాహుల్ త్రిపాఠి జోరు ముంబై బేజారు