Tirupati Stampede : తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు టీటీడీలో ఉద్యోగాలు

Tirupati Stampede : తిరుపతి తొక్కిసలాటలో మృతుల కుటుంబీకులకు కాంట్రాక్టు ఉద్యోగం, పరిహారంపై టీటీడీ తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా జనవరి 8వ తేదీన తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మృతి చెందడంతో పాటు పలువురు గాయపడిన విషయం తెలిసిందే.

Tirupati Stampede Updates

ఈ ఘటనకు సంబంధించి మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు వీరిలో అర్హత కలిగిన ఒకరికి కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఉద్యోగం, అలాగే పిల్లలకు విద్యా సహాయం అందించాలని.. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించాలని గత నెలలో జరిగిన టీటీడీ బోర్డులో తీర్మానం చేసి అనుమతి కోసం ప్రభుత్వానికి పంపారు. ఈ క్రమంలో టీటీడీ నిర్ణయాలను ఆమోదించడంతో పాటు వెంటనే అమలుచేయాలంటూ దేవదాయశాఖ కార్యదర్శి వినయ్‌చంద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read : ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన ఫ్రాన్స్ అధ్యక్షుడు

Leave A Reply

Your Email Id will not be published!