TN Minister Gandhi : పొంగల్ బహుమతిగా రేషన్ తో పాటు చీర, ధోవతి పంపిణీ చేస్తాం
Minister Gandhi : కుటుంబ కార్డులకు జనవరి మొదటి వారం నుంచి రేషన్ దుకాణాల ద్వారా పొంగల్ గిఫ్ట్‌తో చీర, ధోవతి పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి గాంధీ పేర్కొన్నారు. ఈ అంశంపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ… ఉచిత ధోవతి, చీరల పంపిణీ పథకానికి సంబంధించి నేత కార్మికులు తయారీ పనులు మూడు నెలల నుంచే ప్రారంభించారని తెలిపారు.12,040 చేనేత మగ్గాలు, 54,190 మరమగ్గాల్లో నేత కార్మికుల సహకార సంఘాల సభ్యులను ప్రోత్సహించేలా వస్త్ర తయారీ ఆర్డర్లు అప్పగించినట్లు ఆయన తెలిపారు.
TN Minister Gandhi Comment..
అంతే కాకుండా,నేత కార్మికుల జీవనాధారం మెరుగుపడేలా రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఇస్తోందని, ఉచిత చీర, ధోవతి, యూనిఫాం పథకాలను నేత కార్మికులకు వర్తింపజేయలేదని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. పొంగల్ సందర్భంగా ఉచిత చీర, ధోవతితోపాటు చక్కెర, ఇతర సరుకులను రేషన్ దుకాణాల ద్వారా పంపిణీచేసేలా చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.
Also Read : Maharashtra CM : రాజీనామాకు సిద్దమైన మహారాష్ట్ర సీఎం షిండే