Jayalalitha: నేడు జ‌య‌ల‌లిత వ‌ర్ధంతి

Jayalalitha: వెండితెర అందమైన చందమామ జయలలిత. కుందనపు బొమ్మలా కనిపించే కుదురైన రూపంతో రూపానికి తగిన స్వరం , అందం

వెండితెర అందమైన చందమామ జయలలిత. కుందనపు బొమ్మలా కనిపించే కుదురైన రూపంతో రూపానికి తగిన స్వరం , అందం .. అభినయం .. అదృష్టం కలిస్తే జయలలిత(Jayalalitha), కృషి .. పట్టుదల .. కార్యదీక్షగ‌ల‌సిన‌ జయలలిత వ‌ర్ధంతి నేడు. మ‌రిన్ని వివ‌రాల‌లోకి వెళితే…

Jayalalitha Amma Biography - RoutineRight

 

జయలలిత అసలు పేరు ‘కోమలవల్లి’ .. ఆమె తల్లిదండ్రులు జయరామ్ – వేదవల్లి. అప్పటి మైసూర్ రాష్ట్రంలోని ‘పాండవపుర’ తాలూకాలోని ‘మెలుకోటే’లో ఆమె జన్మించారు. తమిళ అయ్యంగార్ల కుటుంబంలో జన్మించిన ఆమెను, ‘జయలలిత’ అనే పేరుతో స్కూల్లో చేర్పించారు. అప్పటి నుంచి ఆమె అదే పేరుతో కొనసాగుతూ వచ్చారు. జయలలిత(Jayalalitha) తల్లి ‘వేదవల్లి’ ‘సంధ్య’ పేరుతో తెలుగులో ఆమె చాలా సినిమాల్లో నటించారు. సినిమాలతో తల్లి బిజీగా ఉండటం వలన, చిన్నప్పటి నుంచే జయలలితకు సినిమా వాతావరణం అలవాటై . తల్లి ప్రోత్సాహంతో ఆమె కూడా నటన దిశగా అడుగులు వేసింది . ‘కానిస్టేబుల్ కూతురు’ .. ‘అమరశిల్పి జక్కన్న’ సినిమాల్లో ఒక డాన్సర్ గా మెరిసిన జయలలిత, ‘మనుషులు మమతలు’ సినిమాతో కథానాయికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.‘మనుషులు మమతలు’.. కథానాయికగా జయలలితకు తొలి సినిమా. ఈ సినిమాలో స్విమ్ సూట్లో కనిపించి, మనసున్న కుర్రాళ్లందరినీ మన్మథులుగా మార్చేసింది. ఈ సినిమాలో స్విమ్మింగ్ పూల్లో చిత్రీకరించిన పాటలో ‘సిగ్గేస్తోందా .. సిగ్గేస్తోందా’ అంటూనే తాను సిగ్గులమొగ్గయ్యే తీరును వర్ణించాలంటే మరిన్ని మాటలు వెతుక్కోవలసి వస్తుంది.

ఇక ‘చిన్నడ గొంబే’ సినిమాతో కథానాయికగా కన్నడలోను ఘన విజయాన్ని అందుకున్న జయలలిత(Jayalalitha), తమిళంలో కథానాయికగా కెరియర్ ఆరంభంలోనే ఎంజీఆర్ తో చేసిన ‘కన్నితాయి’ సినిమాతో ఆమె పేరు గ్లామర్ కి పర్యాయపదంగా మారిపోయింది. ఇక తెలుగు విషయానికొస్తే . ఆ సినిమాల్లో ఆమె గ్లామర్ వెలుగు రేఖలా మెరిసిన తీరును .. తేనెవానై కురిసిన తీరును ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. వరుస విజయాలు తమిళ ప్రేక్షకుల హృదయాల్లో ఆమె స్థానాన్ని సుస్థితరం చేశాయి. ఆ సమయంలో తెలుగులో ఆమె చేసిన సినిమాలను వ్రేళ్లమీద లెక్కపెట్టొచ్చు. తెలుగు సినిమాలకి సంబంధించి ‘కోటలోని మొనగాడా .. ‘ .. ‘అల్లా నేరేడు చెట్టుకాడ ..’ .. ‘సిగ్గేస్తోందా .. సిగ్గేస్తోందా ..’ ‘మగవాడివలే ఎగరేసుకుపో .. ‘ .. ‘ఎర్రా బుగ్గలమీద మనసైతే .. ‘ వంటి పాటలు ఎక్కడి నుంచైనా వినిపించినప్పుడు, ఆ పాటల్లో అందంగా మెరిసిన జయలలిత రూపమే కంటి తెరపై కదులుతుంది ..

Birth Anniversary: These Unseen Pics Of Jayalalitha From Her Childhood To  Acting Days Are A Gold Mine!

తెలుగు తెరపై నటన పరంగా జయలలిత తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. కథానాయిక పాత్ర మోడ్రన్ గా .. గ్లామరస్ గా కనిపించే జయలలిత డేట్స్ కోసం ఎన్టీఆర్ .. ఏఎన్నార్ సైతం వెయిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. . ఇలా ఒక కథానాయికతో కలిసి నటించాలని స్టార్ హీరోలు సైతం ఆసక్తిని చూపడం జయలలిత విషయంలో మాత్రమే జరిగి ఉంటుంది. ఎన్టీఆర్ తో ఆమె చేసిన ‘ఆలీబాబా 40 దొంగలు’ .. ‘ దేవుడు చేసిన మనుషులు’, ఏఎన్నార్ తో చేసిన ‘ఆస్తిపరులు’ .. ‘ అదృష్టవంతులు’ ఆమె కెరియర్లో చెప్పుకోదగినవిగా నిలిచాయి

ఎంజీఆర్ తమిళనాట వెండితెరపై ఆమెను ఎదురులేని మహా నాయికగా .. తిరుగులేని మహారాణిగా తీర్చిదిద్దారు ఆయన ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తెరపై బుట్టబొమ్మలా కనిపించే జయలలిత(Jayalalitha), కరకు రాజకీయాలకు భయపడి పారిపోతుంద‌ని అంతా అనుకున్నా వాళ్లందరి అంచనాలను తలక్రిందులు చేసి, ముఖ్యమంత్రిగా తమిళనాడు రాజకీయాలను తన కనుసైగలతో శాసించేస్థాయికి చేరుకుంది. ప్రజా పథకాలతో ప్ర‌త్య‌ర్ధి వ్యూహాల‌కు చెక్‌పెట్టిన సమర్థురాలు .. కఠోరమైన పరిస్థితులకు కఠినమైన నిర్ణయాలతో పాఠం చెప్పిన ధీరోదాత్తురాలు .. ఎన్నో విమర్శలను, మరెన్నో వివాదాలను నిబ్బరంగా ఎదురించి నిలిచిన నాయకురాలు. అవమానాలు .. మోసాలు .. నమ్మక ద్రోహాలు ఎన్నిమార్లు ఎదురైనా, ఆమె మోములో చిరునవ్వు .. కళ్లలో ప్రశాంతత .. కోల్పోక గుండెధైర్యాన్ని నింపుకుని తమిళ ప్రజల గుండెల్లో ‘పురట్చి తలైవి’గా నిల‌చిన మేరుపర్వతం వంటి ఆ నాయకురాలిని స్మరించుకుందాం

No comment allowed please