Rohit Sharma Sanju Samson : టార్చ్ బేర‌ర్ వ‌ర్సెస్ స్టార్ హిట్ట‌ర్

కీల‌క పోరులో ట్ర‌బుల్ షూట‌ర్ ఎవ‌రో

Rohit Sharma  : ఐపీఎల్ 2022లో అస‌లైన మ‌జా ఏమిటో చూపించేందుకు రెడీ అవుతున్నాయి రాజ‌స్థాన్ రాయ‌ల్స్ , ముంబై ఇండియ‌న్స్. ఇరు జ‌ట్లు అత్యంత బ‌ల‌మైన‌మ‌వి. ఒక‌ర‌కంగా చెప్పాలంటే రాజస్థాన్ కంటే ముంబై అన్ని ఫార్మాట్ ల‌లో బ‌లంగా ఉంది.

ఇప్ప‌టికే ఆ జ‌ట్టు ట్రాక్ రికార్డ్ రాజ‌స్థాన్ కంటే బెట‌ర్. విచిత్రం ఏమిటంటే ఇరు జ‌ట్ల‌కు వ్యూహ‌క‌ర్త‌లు, మెంటార్లు మాత్రం శ్రీ‌లంకకు చెందిన దిగ్గ‌జ మాజీ క్రికెట‌ర్లు కావ‌డం విశేషం.

ఒక‌రు ముంబై ఇండియ‌న్స్ కు ఉండ‌గా మ‌రొక‌రు రాజ‌స్థాన్ రాయ‌ల్స్(Rohit Sharma )కు ఉన్నారు. మ‌హేళా జ‌య‌వ‌ర్ద‌నే ముంబై జ‌ట్టుకు డైరెక్ట‌ర్ గా ఉన్నాడు. ఇక కుమార సంగ‌క్క‌ర రాజ‌స్తాన్ కు మెంటార్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

ఈసారి ఐపీఎల్ లో స‌మ ఉజ్జీల స‌మ‌రం మాత్రం జ‌ర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ముంబై మొద‌టి మ్యాచ్ లో ఓట‌మి పాలు కాగా రాజ‌స్థాన్ బోణీ కొట్టి దూకుడు మీదుంది.

ముంబై ఇండియ‌న్స్ కు హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ(Rohit Sharma )కెప్టెన్ కాగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు టార్చ్ బేర‌ర్ సంజూ శాంస‌న్ స్కిప్ప‌ర్ గా ఉన్నాడు. ఇరు జ‌ట్ల‌కు మ్యాచ్ ప‌రంగా కీల‌కం కానుంది.

ఏది ఏమైనా ప‌రుగుల వ‌ర‌ద పార‌డం మాత్రం ఖాయం. ఈసారి దిగ్గ‌జ ఆట‌గాళ్ల‌తో అత్యంత ప‌టిష్టంగా క‌నిపిస్తోంది రాజ‌స్థాన్. మ‌రో వైపు గ‌త ఐపీఎల్ నుంచి నేటి దాకా ముంబై ఇండియ‌న్స్ కొంత ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది.

ఏది ఏమైనా అద్భుత‌మైన ఆట‌ను ఆస్వాదించాలంటే వేచి చూడ‌ట‌మే మిగిలింది.

Also Read : ర‌సెల్ దెబ్బ పంజాబ్ అబ్బా

Leave A Reply

Your Email Id will not be published!