TPCC Comment : కాంగ్రెస్ భవితవ్యం ప్రశ్నార్థకం
'కోవర్టుల' కలకలం కాంగ్రెస్ కు శాపం
TPCC Comment : ఓ వైపు ఐసీయూలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆక్సిజన్ తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆ పార్టీకి చెందిన అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధిపత్య పోరులో సతమతం అవుతోంది. ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక సమస్య ఆ పార్టీని వెంటాడుతోంది.
ఇప్పటి వరకు కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేస్తుందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఎవరు పార్టీని లీడ్ చేయాలనే దానిపై. ఓ వైపు భారతీయ జనతా పార్టీ ఆక్టోపస్ లాగా వస్తిరించింది.
మరో వైపు ముందస్తు వ్యూహాలతో రేపు రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికలకు రూట్ మ్యాప్ రెడీ చేసుకునే పనిలో పడింది. కానీ 137 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా గతంలో చోటు చేసుకున్న పరిణామాల గుణపాఠాలను నేర్చుకున్నట్టు కనిపించడం లేదు.
ఏపీ ఉమ్మడి రాష్ట్రంలో గట్టి పట్టు కలిగిన పార్టీ ఏరి కోరి ఉద్యమం ఫలితంగా మేడం సోనియా గాంధీ ఇచ్చిన మాట మేరకు కట్టుబడి ఉన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రకటించారు. ఇదే ప్రకటన తమకు లాభిస్తుందని ఆశించిన కాంగ్రెస్ చేజేతులా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయింది.
ఇదే సమయంలో అటు ఏపీలో ఉనికి కోల్పోగా తెలంగాణలో పట్టున్నా పట్టుకోలేక చతికిల పడింది. సీనియర్ల మధ్య ఆధిపత్య పోరు ఆ పార్టీకి శాపంగా మారింది. ఇదే పార్టీని ప్రజల్లో చులకన అయ్యేలా చేస్తోంది.
దీనిని ఇప్పటి వరకు గమనించక పోవడం గమనార్హం. పార్టీ ఇప్పటి వరకు రాష్ట్రానికి సంబంధించి ఇన్ ఛార్జ్ లను మార్చింది. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అధికార పార్టీకి చెందిన టీఆర్ఎస్ లో చేరడం ప్రజల్లో మైనస్ అయ్యేలా చేసింది.
ఈ పార్టీకి ఓటు వేసినా ఒక్కటే టీఆర్ఎస్ కు ఓటు వేసినా ఒక్కటేనన్న అభిప్రాయానికి వచ్చారు. ఈ తరుణంలో పీసీసీ చీఫ్ , పదవుల ఎంపిక, కేటాయింపు మరింత ముదిరి పాకాన పడింది.
ఈ తరుణంలో కీలకమైన నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. సైలంట్ గా కొనసాగుతూ వస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా కుదుపునకు లోనైంది.
మొదట్లో టీఆర్ఎస్ లో చేరి ఆ తర్వాత టీడీపీలో జాయిన్ అయి తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న రేవంత్ రెడ్డి(TPCC) రాకతో సీన్ మారింది. ఆయన వచ్చాక హల్ చల్ ప్రారంభమైంది. సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఆందోళనలు, నిరసనలు, విమర్శలు, ఆరోపణలు ఇలా ప్రతిదీ చోటు చేసుకున్నాయి.
సీనియర్లు బహిరంగంగానే రేవంత్ రెడ్డి వన్ మేన్ షోను విమర్శిస్తూ వచ్చారు. ఇది హై కమాండ్ దాకా వెళ్లింది. పార్టీని వీడిన వారు సంచలన ఆరోపణలు చేశారు.
తాజాగా సీనియర్ నాయకులు మూకుమ్మడిగా రేవంత్ రెడ్డిపై దాడి చేయడం ప్రారంభించడం కలకలం రేపింది. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజ నర్సింహ్మ ఏకంగా కోవర్టుల వల్ల పార్టీకి నష్టం జరుగుతోందంటూ బాంబు పేల్చారు.
అనంతరం మల్లు భట్టి విక్రమార్క నివాసంలో సమావేశమైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గా రెడ్డి, మధు యాష్కి, దామోదర రాజ నర్సింహ్మ సంయుక్తంగా నిప్పులు చెరిగారు.
బయటి నుంచి వచ్చిన వారికే కమిటీల్లో ప్రయారిటీ ఇచ్చారంటూ ఆరోపించారు. దీని విషయంపై హై కమాండ్ దృష్టికి తీసుకు వెళతామని చెప్పారు. ఇదే సమయంలో తమను కోవర్టులంటూ ముద్ర వేస్తున్నారంటూ వాపోయారు. అసలు కోవర్టులు ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ తరుణంలో అనిల్ షాకింగ్ కామెంట్స్ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై. ఆయనే అసలు కోవర్టు అంటూ ఆరోపించారు. మొత్తం సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి ఉండగా తనంతకు తానుగా అస్తిత్వం కోసం పోరాడటం నాయకులు, కార్యకర్తలను విస్తు పోయేలా చేస్తోంది.
ఏది ఏమైనా తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఈ తరుణంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. దానిని గుర్తించి అందరూ కలిసి సమన్వయంతో పని చేయగలిగితే పార్టీకి మనుగడ ఉంటుంది. అంతకంటే భవిష్యత్తు ఉంటుందనేది గుర్తించాలి.
ఇక పార్టీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి కూడా తన తీరు మార్చు కోవాల్సిన అవసరం ఉంది. లేక పోతే తన రాజకీయ భవిష్యత్తుకు ..పార్టీకి కూడా తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది .
ఈ మొత్తం వ్యవహారాన్ని తెగే దాకా లాగకుండా ఆది లోనే తుంచి వేసే ప్రయత్నం హైకమాండ్ చేయాల్సి ఉంది.
Also Read : రాహుల్ యాత్రలో పాల్గొననున్న కమల్