Trent Boult : రాణించిన జైస్వాల్ మెరిసిన బౌల్ట్

కీల‌క ఇన్నింగ్స్ ఆడిన శాంస‌న్

Trent Boult : పాని పూరీ అమ్ముకుంటూ క్రికెట్ స్టార్ గా ఎదిగిన య‌శ‌స్వి జైస్వాల్ మ‌రోసారి రాణించాడు ఐపీఎల్ మ్యాచ్ లో. అత్యంత కీల‌క‌మైన గేమ్ లో మ‌రోసారి స‌త్తా చాటాడు.

ఒక ద‌శ‌లో టాప్ స్కోర‌ర్ గా ఉన్న స్టార్ హిట్ట‌ర్, ఇంగ్లండ్ క్రికెట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ త‌క్కువ స్కోర్ కే వెనుదిరిగాడు. దీంతో ప‌రుగులు చేయాల్సిన బాధ్య‌త‌ను త‌న కెప్టెన్ సంజూ శాంస‌న్ తో క‌లిసి జైశ్వాల్ ప‌రుగులు పెట్టించాడు.

ఎక్క‌డా తొట్రు పాటు ప‌డ‌కుండా అద్భుత‌మైన షాట్స్ తో అల‌రించాడు. శాంస‌న్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న

నిర్ణ‌యం స‌త్ఫ‌లితం ఇచ్చింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 178 ర‌న్స్ చేసింది.

ఆరు వికెట్లు కోల్పోయింది. ఇందులో య‌శ‌స్వి జైస్వాల్ 29 బంతులు మాత్ర‌మే ఆడి 41 ర‌న్స్ చేశాడు. ఇందులో 6 ఫోర్లు ఒక సిక్స‌ర్ ఉన్నాయి. ఇక కెప్టెన్ శాంస‌న్ 24 బంతులు ఆడి 6 ఫోర్ల‌తో 32 ర‌న్స్ చేసి కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు.

దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ కూడా రాణించాడు. 179 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 154 ప‌రుగులు చేసింది. 24 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది.

జోస్ బ‌ట్ల‌ర్ మొద‌ట్లోనే వెను దిరిగినా య‌శ‌స్వి జైస్వాల్ , సంజూ శాంస‌న్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ను గ‌ట్టెక్కించారు. ఇక రాజ‌స్థాన్ బౌల‌ర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. టెంట్ బౌల్ట్ 4 ఓవ‌ర్లు వేసి 18 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 2 వికెట్లు తీశాడు.

డికాక్, బ‌దోనీని వెన‌క్కి పంపిస్తే ప్రసిద్ద్ కృష్ణ కీల‌క‌మైన కేఎల్ రాహుల్ ను బోల్తా కొట్టించాడు. బౌల్ట్(Trent Boult) కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ ద‌క్కింది.

ల‌క్నో జ‌ట్టులో దీప‌క్ హూడా 59 ప‌రుగులు చేశాడు.

ప్ర‌మాద‌క‌రంగా త‌యారైన హూడాను యుజ్వేంద్ర చాహ‌ల్ సూప‌ర్ బంతికి ఔట్ చేశాడు.

Also Read : పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఫైట్

Leave A Reply

Your Email Id will not be published!