WFI Chief : డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ పై విచార‌ణ వాయిదా

జూలై 7కు వాయిదా వేసిన ఢిల్లీ కోర్టు

WFI Chief : మ‌హిళా రెజ్ల‌ర్లు తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన భార‌త రెజ్లింగ్ స‌మాఖ్య చీఫ్ , బీజేపీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ పై ఢిల్లీ పోలీసులు కోర్టుకు నివేదిక‌ను స‌మ‌ర్పించారు. కాగా ఈ ఛార్జ్ షీట్ పై విచార‌ణ చేప‌ట్టింది శ‌నివారం ఢిల్లీ కోర్టు. మ‌రిన్ని వివ‌రాలు న‌మోదు చేయాల్సి ఉంద‌ని, అద‌న‌పు ఛార్జ్ షీట్ దాఖ‌లు చేస్తామ‌ని పేర్కొనడంతో కోర్టు విచార‌ణ‌ను జూలై 7కి వాయిదా వేసింది.

ద‌ర్యాప్తు ఇంకా పూర్తి కాలేద‌ని , అనుబంధ ఛార్జ్ షీట్ దాఖ‌లు చేసేందుకు స‌మ‌యం కావాల‌ని న‌గ‌ర పోలీసులు ధ‌ర్మాస‌నాన్ని కోరారు. ఈ మేర‌కు విచార‌ణ అనంత‌రం న్యాయమూర్తి ఒప్పుకున్నారు. ఎంత త్వ‌ర‌గా వీలైతే అంత ముంద‌స్తుగా నివేదిక స‌మ‌ర్పించాల‌ని ఆదేశించారు. ఇప్ప‌టికే స‌మ‌యం మించి పోయింద‌ని , దీనిపై ఉత్కంఠ నెల‌కొంద‌ని అభిప్రాయ‌ప‌డింది ధ‌ర్మాస‌నం.

ఇదిలా ఉండ‌గా డ‌బ్ల్యుఎఫ్ఐ చీఫ్(WFI Chief) పై తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇప్ప‌టికే 30 మందికి పైగా మ‌హిళా రెజ్ల‌ర్లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ‌ను లైంగికంగా, మాన‌సికంగా , శారీర‌కంగా వేధింపుల‌కు గురి చేశాడ‌ని ఆరోపించారు. ఆపై జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగారు. వారిపై ఖాకీలు దాడికి పాల్ప‌డ్డారు. యావ‌త్ దేశం ఛీద‌రించుకుంది. ఇదే స‌మ‌యంలో సుప్రీంకోర్టు సీరియ‌స్ వార్నింగ్ ఇవ్వ‌డంతో ఢిల్లీ ఖాకీలు ఎట్ట‌కేల‌కు ఎంపీపై కేసు న‌మోదు చేశారు.

Also Read : Pakistan Security : ఇండియాకు పాక్ సెక్యూరిటీ రాక

 

Leave A Reply

Your Email Id will not be published!