Deputy CM Pawan : డిప్యూటీ సీఎంకు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికిన గిరిజనులు

తమ గోడు వినేందుకు పవన్ రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు...

Deputy CM Pawan : ఏజెన్సీ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది.నిన్న(శుక్రవారం) పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం రూ.9 కోట్లతో బాగుజోల గ్రామ రహదారి పనులకు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కాగా, నేడు మరో గిరిజన ప్రాంతం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ బల్లగరువులో పవన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బల్లగరువు గ్రామంలో 13 రహదారులకు సంబంధించిన పనులకు డిప్యూటీ సీఎం(Deputy CM Pawan) శంకుస్థాపన చేశారు. అంతకుముందు బల్లగరువు నుంచి కొండపైకి వెళ్లిన ఆయన వెళ్లగా.. స్థానిక గిరిజనులు సంప్రదాయ నృత్యాలతో ఘనస్వాగతం పలికారు. వారితో సరదాగా ముచ్చటించిన ఉపముఖ్యమంత్రి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలన్నీ త్వరలోనే తీర్చుతానని పవన్ హామీ ఇచ్చారు. అనంతరం గిరిజన మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యాలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ వెంట జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ రమేశ్ బాబు, సుందరపు విజయ్ కుమార్ పాల్గొన్నారు. జోరు వానను సైతం లెక్కచేయకుండా పవన్ పర్యటన కొనసాగిస్తున్నారు.

Deputy CM Pawan Visit..

తమ గోడు వినేందుకు పవన్ రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వందల ఏళ్లుగా రోడ్లు, వైద్య, విద్య సదుపాయం లేక నానావస్థలు పడుతున్నామని, అలాంటిది ఇన్నాళ్లకు తమ సమస్యలు తీర్చేందుకు ఓ నాయకుడు వచ్చాడంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ గిరిజన ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ పర్యటించారు. వారి సమస్యలు చూసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు, రోడ్లు, విద్య, వైద్యం వంటి సదుపాయాలు సమకూర్చేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. స్థానికుల కేరింతల నడుమ డిప్యూటీ సీఎం పవన్ పర్యటన ఉత్సాహంగా కొనసాగుతోంది.

Also Read : CM Revanth Reddy : బీఆర్ఎస్ సర్కార్ రైతు భరోసా నియామకంపై భగ్గుమన్న సీఎం

Leave A Reply

Your Email Id will not be published!