Sidhu Video Viral : టైమ్స్ స్క్వేర్ లో సిద్దూకు నివాళి

సోష‌ల్ మీడియాలో వీడియోలు హ‌ల్ చ‌ల్

Sidhu Video Viral : ప్ర‌ముఖ గాయ‌కుడిగా పేరొందిన పంజాబ్ కు చెందిన సిద్దూ మూసే వాలాకు ఘ‌న‌మైన నివాళులు అర్పించారు అమెరికా లోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు(Sidhu Video Viral) సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

గ‌త నెల‌లో సింగ‌ర్ సిద్దూ మూసే వాలాను దారుణంగా హ‌త్య చేశారు. రెండు గ్రూపుల మ‌ధ్య ఉన్న విభేదాల కార‌ణంగా అత‌డిని చంపామంటూ కెన‌డాకు చెందిన గోల్డీ బ్రార్ ప్ర‌క‌టించాడు.

ఈ దారుణ హ‌త్య దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు 9 మంది నిందితుల‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.

ఇక ఆయ‌న‌కు నివాళిగా న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ లోని బిల్ బోర్డ్ ల‌లో దివంగ‌త గాయ‌కుడు సిద్దూ మూసే వాలా కు సంబంధించిన ప‌లు పాట‌ల్ని, వీడియోల‌ను(Sidhu Video Viral) ప్ర‌సారం చేశారు.

వంద‌లాది మంది సిద్దూ పాట‌ల్ని వింటూ ఎంజాయ్ చేశారు. ఆయ‌న‌కు ఘ‌నంగా నివాళులు అర్పించారు. అభిమానులు, భార‌త దేశానికి చెందిన వారు చాలా సేపు రోడ్డు పైనే నిలిచి సిద్దూ మూసే వాలా పాడిన పాట‌ల‌ను చూసి ఆనందించారు.

ఇదిలా ఉండ‌గా వీడియోల‌ను చూస్తున్న స‌మ‌యంలో సిద్దూ తొడ కొట్టే స్టెప్ ను కాపీ చేయ‌డం కూడా క‌నిపించ‌డం విశేషం. సిద్దూ మూసే వాలా పుట్టిన రోజు సంద‌ర్భంగా నివాళిగా చిన్న నాటి చిత్రాల‌ను పంచుకుంది.

ఫ్యాన్స్ అత‌డిని లెజెండ్ సింగ‌ర్ గా పేర్కొంటారు. ఇందులో మ‌రో క్లిప్ లో సిద్దూ మూసే వాలా పేరెంట్స్ తో దిగిన క్లిప్ కూడా హ‌ల్ చ‌ల్ చేసింది.

Also Read : గోల్డీ బ్రార్ ను అప్ప‌గించాల‌న్న భార‌త్

Leave A Reply

Your Email Id will not be published!