Trivikram Srinvas : దర్శకుడా కలకాలం వర్ధిల్లు
కలం బలం త్రివిక్రమ్
Trivikram Srinvas : తెలుగు సినీ వాకిట తనదైన ముద్రను వేసిన వాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. మాటల రచయితగా మొదలైన తన ప్రస్థానం దిగ్గజ దర్శకుడి స్థాయికి వెళ్లేలా చేసింది. నవంబర్ 7న ఆయన పుట్టిన రోజు. మాటలతో మంటలు రేపి గుండెల్ని చీల్చేలా సినిమాలు తీసి చరిత్ర సృష్టించాడు.
Trivikram Srinvas Brithday
ఆయన పూర్తి పేరు ఆకెళ్ల నాగ శ్రీనివాస్. వయసు 52 ఏళ్లు. నవంబర్ 7, 1971న బీమరవంలో పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టాడు. సాధ్యమైనంత వరకు సైన్స్ చదివిన వాళ్లు సాహిత్యం పట్ల మక్కువ చూపరు. కానీ త్రివిక్రమ్(Trivikram Srinivas) అలా కాదు. తనను తాను చేయి తిరిగిన రచయితగా పేరొందాడు. కొంత కాలం పాటు పంతులుగా పని చేశాడు.
ఆ వెంటనే సినిమా మీద వ్యాహమోంతో పోసాని కృష్ణ మురళి వద్ద సహాయకుడిగా పని చేశాడు త్రివిక్రమ్. నటుడు సునీల్ తో కలిసి ఒకే గదిలో ఉండే వాడు. 1999లో తన కెరీర్ లో మరిచి పోలేని రీతిలో స్వయం వరం సినిమాకు రచయితగా స్టార్ట్ చేశాడు. వరుసగా నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, నువ్వే కావాలి బంపర్ హిట్ మూవీస్ కు డైలాగులు రాశాడు. ఇవి సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చాయి.
ఆ తర్వాత మహేష్ బాబుతో అతడు తొలిసారి దర్శకత్వంలో తీశాడు. ఇది తెలుగు సినిమా చరిత్రలోనే బంపర్ హిట్ గా నిలిచింది. బన్నీతో జులాయి, పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది తీశాడు. ఇటీవలే అల్లు అర్జున్ తో అల వైకుంఠ పురంలో తీశాడు. ఇది సెన్సేషన్. ప్రస్తుతం మహేష్ తో మూడో సినిమా తీస్తున్నాడు గుంటూరు కారం పేరుతో. ఏది ఏమైనా మాటలతో సినిమాలను కూడా సక్సెస్ చేయొచ్చని త్రివిక్రమ్ శ్రీనివాస్ నిరూపించాడు.
Also Read : BJP 4th List : బీజేపీ నాల్గో జాబితా విడుదల