LG Manoj Sinha : దేశ సమగ్రతకు భంగం కలిగిస్తే ఊరుకోం
జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా
LG Manoj Sinha : జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సంచలన కామెంట్స్ చేశారు. దేశ సమగ్రతకు భంగం కలిగించే వ్యక్తులు ఎవరైనా ఎంతటి స్థాయిలో ఉన్నా విడిచి పెట్టే ప్రసక్తి లేదన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా న్యాయ జరిగేంత వరకు కాశ్మీర్ లోయలో హత్యలు ఆగవంటూ సంచలన కామెంట్స్ చేశారు మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా.
ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మత సామరస్యం దెబ్బ తీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అటువంటి వారి పట్ల ఫోకస్ పెట్టాలన్నారు. ఎవరు భంగం కలిగించినా లేదా దేశాన్ని అస్థిర పరిచేందుకు ప్రయత్నం చేసినా ఊరుకునే ప్రసక్తి లేదన్నారు లెఫ్టినెంట్ గవర్నర్.
అమాయక పౌరుల హత్యలను సమర్థించడం ద్వారా మత సామరస్యాన్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్న వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా (LG Manoj Sinha) ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఎవరు ఏం చేస్తున్నారనేది రాష్ట్రంలో ప్రతి చోటా నిఘా ఉంది. ఎవరినీ ఊరికే వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు ఎల్జీ. కొందరు తమ స్వప్రయోజనాల కోసం అల్లకల్లోలం సృష్టించాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు.
ఆయన ఎవరి పేరు ప్రస్తావించకుండానే ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఇటీవల షోపియాన్ లో కాశ్మీర్ పండిట్ హత్య గురించి ఫరూక్ అబ్దుల్లా స్పందిస్తూ ..న్యాయ జరిగేంత దాకా ఇలా కొనసాగుతూనే ఉంటాయన్నారు.
Also Read : ఢిల్లీ పోలీస్ బాస్ కు ఫుల్ పవర్స్