PM Modi Tour : జాతీయ సమావేశాల్లో ప్రధాని మోదీ
స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై
PM Modi Tour : హైదరాబాద్ లో చాలా కాలం తర్వాత జరుగుతున్న భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi Tour) హాజరయ్యారు.
శనివారం ఆసక్తికరమైన సన్నివేశానికి వేదికగా మారింది భాగ్యనగరం. ఓ వైపు విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా కూడా నగరానికి చేరుకున్నారు.
ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పూర్తి మద్దతు ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ (CM KCR) స్వయంగా ఆహ్వానం పలకడం విశేషం.
ఇదే సమయంలో ప్రోటోకాల్ ప్రకారం తప్పనిసరిగా ప్రధానమంత్రి వస్తున్న సమయంలో హాజరు కావాల్సి ఉంది. కానీ సీఎంకు బదులు మంత్రి తలసాని యాదవ్ స్వాగతం పలికారు మోదీకి.
ఆయనతో పాటు తెలంగాణ, పుదుద్చేరి రాష్ట్రాల గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రధానికి గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు.
ప్రధానమంత్రితో పాటు బీజేపీ జాతీయ సమావేశాలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, జాతీయ నేతలు హాజరయ్యారు. ఇదిలా ఉండగా రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రధానమంత్రికి సీఎం తప్పనిసరిగా గ్రాండ్ వెల్ కమ్ స్వాగతం పలకాలన్నది ఎక్కడా లేదన్నారు. గతంలో పీఎంకు కేసీఆర్ స్వాగతం పలికారని చెప్పారు.
ఏది ఏమైనా విమర్శలు, ఆరోపణలు మానేసి రాష్ట్రం ఎలా అభివృద్ది చెందుతుందో చూడాలన్నారు. మరో వైపు ప్రధాని వస్తున్నా సీఎం హాజరు కాక పోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు బీజేపీ శ్రేణులు.
Also Read : భారత రాజకీయాల్లో సిన్హా అరుదైన నేత