TS SSC Results : 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల
విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రా రెడ్డి
TS SSC Results : ఎట్టకేలకు తెలంగాణ సర్కార్ 10వ తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. మన కంటే ముందు ఏపీలో విడుదలయ్యాయి. మే 9న ఇంటర్ ఫలితాలను విడుదల చేసింది సర్కార్. బుధవారం పదవ తరగతి పరీక్షా ఫలితాలను(TS SSC Results) రిలీజ్ చేశారు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. బషీర్ బాగ్ లోని ఎస్సీఈఆర్టీలో వీటిని విడుదల చేశారు. పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ దేవసేన ఉన్నారు.
ఈ ఏడాది జరిగిన ఫలితాల్లో రెగ్యులర్ విద్యార్థులు 86.80 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 88.53 శాతం ఉత్తీర్ణత శాతం నమోదు చేశారు. కాగా బాలికలు బాలుర కంటే 3.85 శాతం అధికంగా పాస్ కావడం విశేషం.
ప్రైవేట్ విద్యార్థులు 44.51 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా బాలురు 43.06 శాతం, బాలికలు 47.73 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు 10వ తరగతి ఎగ్జామ్స్(TS SSC Results) జరిగాయి. మొత్తం 4.4 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరయ్యారు.
ఇక పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 14వ తేదీ నుంచి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. 22 దాకా కొనసాగుతాయని చెప్పారు. పరీక్షలు తప్పిన విద్యార్థులు మే 26వ తేదీ లోపు సంబంధిత బడుల్లో పరీక్ష ఫీజు చెల్లించాలని స్పష్టం చేశారు. ఒకవేళ తమకు వచ్చిన మార్కులలో ఏమైనా అనుమానం ఉంటే రీకౌంటింగ్ కు కూడా ఛాన్స్ ఇస్తున్నట్లు తెలిపారు. ఇందుకు రూ. 500 కట్టాలని తెలిపారు మంత్రి.
Also Read : నా రోజా నువ్వే సాంగ్ వైరల్