Na Roja Nuvve : నా రోజా నువ్వే సాంగ్ వైర‌ల్

విజ‌య్..సామ్ ఖుషీ పై అంచ‌నాలు

Na Roja Nuvve : విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత రుత్ ప్ర‌భు క‌లిసి న‌టించిన ఖుషీ సినిమా టీజ‌ర్ ఇటీవ‌లే విడుద‌లైంది. మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. తాజాగా ఇదే మూవీకి సంబంధించి నా రోజా నువ్వే(Na Roja Nuvve) పేరుతో పాట‌ను విడుద‌ల చేశారు మూవీ మేక‌ర్స్. యూత్ నుంచి ఎక్కువ కాంప్లిమెంట్స్ వ‌స్తున్నాయి. ప్రేమికుల‌కుగా స‌మంత , దేవ‌ర‌కొండ న‌టించారు. ఇప్ప‌టికే వీరిద్ద‌రూ క‌లిసి మ‌హాన‌టి మూవీలో న‌టించారు.

శివ నిర్వాణ ఖుషీ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ చిత్రం పూర్తిగా ప్రేమ‌కు సంబంధించిన క‌థ‌. ఇందులో హిజాబ్ ధ‌రించిన ముస్లిం మ‌హిళ‌గా స‌మంత న‌టించింది. హృద‌యం మల‌యాళం ఫేమ్ హేష‌మ్ అబ్దుల్ వ‌హాబ్ స్వ‌ర‌పరించారు నా రోజా నువ్వే సాంగ్ ను. స‌మంత మ‌రింత అందంగా క‌నిపించింది ఇందులో. ఆమె అందానికి ముగ్ధుడ‌వుతాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇద్ద‌రి మ‌ధ్య బాండింగ్ మ‌రింత హైలెట్ గా నిలిచింది సినిమాకు.

ఖుషీ చిత్రానికి సంబంధించి హైలెట్ ఏమిటంటే సినిమాటోగ్రాఫ‌ర్ ముర‌ళీ. కాశ్మీర్ నేప‌థ్యంలో కొన‌సాగిన ఈ చిత్రానికి సంగీతం, కెమెరా ప‌నిత‌నం హైలెట్ గా ఉండ‌నుంది. క‌ర్కీ రాసిన ఈ పాట త‌మిళ వెర్ష‌న్ కాట్రు వెలియిడై లో ఉంది. ఇక ఖుషీ చిత్రంలో స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాటు వెన్నెల కిషోర్ , జ‌య‌రామ్ , స‌చిన్ ఖేడేక‌ర్ , ముర‌ళీ శ‌ర్మ న‌టించారు. సెప్టెంబ‌ర్ 1న మూవీని విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు నిర్మాత‌లు.

Also Read : లాల్ స‌లామ్’ ర‌జ‌నీకాంత్

Leave A Reply

Your Email Id will not be published!