TSPSC Group1 Cancelled : గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు
కొంప ముంచిన పేపర్ లీకేజీ వ్యవహారం
TSPSC Group1 Cancelled : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బి. జనార్దన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు నిర్వహించిన గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష ను కూడా రద్దు(TSPSC Group1 Cancelled) చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పరీక్షల రద్దు పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు మొత్తం 17 నోటిఫికేషన్లను టీఎస్ పీఎస్సీ జారీ చేసింది. ఇక పేపర్ లీకేజీ వ్యవహారం కొంప ముంచేలా చేసింది. ఏఈ, టౌన్ ప్లానింగ్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది టీఎస్ పీఎస్సీ.
ఇటీవల పేపర్ లీక్ వ్యవహారం బయటకు రావడంతో సీఎస్ శాంతి కుమారి సమీక్ష చేపట్టింది. గ్రూప్ -1 ప్రిలిమ్స్ ను రద్దు చేయమని చెప్పిన చైర్మన్ జనార్దన్ రెడ్డి . చివరకు తన మాట మీద తాను నిలబడటం లేదని తేలి పోయింది. సిట్ దర్యాప్తులో కీలక అంశాలు బయటకు వచ్చాయని, అందుకే తాము గ్రూప్ -1 పరీక్షకు సంబంధించిన ప్రిలిమ్స్ ను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. జూన్ 11న తిరిగి నిర్వహిస్తామని ప్రకటించింది.
మరో వైపు గ్రూప్ -3, గ్రూప్ -4 పరీక్షల తేదీలను ఇప్పటికే వెల్లడించింది. ఇప్పటికే టౌన్ ప్లానింగ్ , ఎంవీఐ పరీక్షలు రద్దు చేసిన టీఎస్ పీఎస్సీ ఇప్పుడు గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షలను కూడా రద్దు చేయడంపై నిరుద్యోగులు, అభ్యర్థులు భగ్గుమంటున్నారు. గత ఏడాది అక్టోబర్ 16న జరిగిన గ్రూప్ -1 పరీక్షను పేపర్ లీక్(TSPSC Group1 Cancelled) అయిన కారణంగా రద్దు చేయాల్సి వచ్చిందని తెలిపారు జనార్దన్ రెడ్డి. టీఎస్పీఎస్సీలో పని చేస్తున్న వారే ఈ లీకులకు పాల్పడ్డారని ఆరోపించారు.
Also Read : సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి