TSRTC MD Sajjanar : మేడారం జాతరకు వెళ్లే బస్సులపై ఏ విధమైన అదనపు చార్జీలు లేవు
ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు
TSRTC MD Sajjanar : తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం జాతర నేటి (బుధవారం) నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. మేడారం జాతరకు TSRTC ప్రత్యేక బస్సులను నడుపుతోంది. మేడారం జాతరకు ఆర్టీసీ 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతోందని టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ తెలిపారు. మేడారం జాతరలో 51 బేసిస్ పాయింట్లు ఏర్పాటుచేశామన్నారు.
TSRTC MD Sajjanar Comment Viral
ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం ఈ జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున హనుమకొండ జిల్లా కాజీపేట నుంచి కూడా బస్సులు నడపనున్నట్లు తెలిపారు. మేడారం జాతరకు మహాలక్ష్మి పథకం అమలులో ఉంటుందన్నారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించారు. ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ స్పష్టం చేశారు.
Also Read : Kishan Reddy : ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రధాని దేశం కోసం పనిచేసారు