TTD : ఆ తేదీ నుంచే తిరుమలలో పవిత్రోత్సవాలు ప్రారంభం

ఉత్సవాల కోసం ఈనెల 14న అంకురార్పణ జరుగనుంది...

TTD : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శించుకుని భక్తులు పరవశించిపోతుంటారు. ఒక్కసారైనా ఆ శ్రీనివాసుడిని దర్శించుకోవాలని తహతహలాడుతుంటారు. అలాగే తిరుమలలో నిత్యం ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం తిరుమలలో పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందు కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈనెల 15 నుంచి 17 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి.

ఉత్సవాల కోసం ఈనెల 14న అంకురార్పణ జరుగనుంది. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక జరిగిన దోషాలు, భక్తులు యాత్రికులు తెలియక చేసిన తప్పులు వల్ల ఏ దోషం రాకుండా నివృత్తి కోసం టీటీడీ(TTD) ఏటా పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవారి ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలను అర్చకులు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో ఉత్సవమూర్తులకు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనాన్ని అర్చకులు నిర్వహించనున్నారు.

TTD Updates

సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇస్తారు. 15న పవిత్రాల ప్రతిష్ట, 16న పవిత్ర సమర్పణ, 17న పూర్ణాహుతి కార్య‌క్ర‌మాలు నిర్వహించనున్న టిటిడి.. ప‌విత్రోత్స‌వాల్లో ఆగ‌స్టు 14న జరగనున్న అంకురార్ప‌ణ తో సహస్రదీపాలంకార సేవను ర‌ద్ధు చేసింది. 15న తిరుప్పావడతోపాటు 15 నుండి 17 వ‌ర‌కు 3 రోజులు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు కూడా టీటీడీ రద్దు చేసింది.

Also Read : Vinesh Phogat : రెజ్లర్ వినేష్ ఫోగట్ అప్పీల్ పై ‘సిఏఎస్’ నుంచి నేడు వెలువడనున్న తీర్పు

Leave A Reply

Your Email Id will not be published!