TTD Alert : సర్టిఫికెట్ ఉంటేనే స్వామి దర్శనం
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన
TTD Alert : కరోనా భూతం మరోసారి ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. ప్రతి తొక్కరు ముసుగు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని , బూస్టర్ డోసు వేసుకోవాలని(TTD Alert) స్పష్టం చేశారు.
ఇప్పటికే సర్కార్ ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ఇటు తెలంగాణ అటు ఏపీ కూడా అలర్ట్ చేసింది. ఈ మేరకు ఆయా ఆలయాలను సందర్శించే భక్తులు విధిగా కరోనా మార్గదర్శకాలు పాటించాలని లేక పోతే దర్శనానికి అనుమతి ఇవ్వ కూడదంటూ పేర్కొంది.
దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD Alert) శనివారం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు కోవిడ్ సర్టిఫికెట్ ఉంటేనే గోవిందుడి దర్శనం ఉంటుందని లేక పోతే నిలిపి వేస్తామని వెల్లడించింది. ఇదిలా ఉండగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి తనయుడు ఆకస్మిక మృతి చెందారు. దీంతో 12 రోజుల పాటు టీటీడీ ఈవోగా పదవీ బాధ్యతలు చేపట్టారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్.
ఈ మేరకు జనవరి 2 నుంచి 11 వరకు 50 వేల చొప్పున 5 లక్షల సర్వ దర్శనం టికెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు టీటీడీ తెలిపింది. సామాన్య భక్తులకు ప్రయారిటీ ఇస్తామని తెలిపింది. ప్రత్యేకించి తిరుమల శ్రీవారి భక్తులు ఇక నుంచి కోవిడ్ లేదని సర్టిఫికెట్ ఉంటేనే అనుమతి ఇస్తామని కుండ బద్దలు కొట్టింది.
Also Read : గురుకుల వైభవం ఆదర్శప్రాయం